ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని బరేలీ(Bareilly)లో మూడు దశాబ్దాలుగా ఓ బంగ్లాదేశ్‌ మహిళ అక్రమంగా నివసిస్తోంది. 30 ఏళ్ల కిందట ఆమె అక్రమంగా భారత్‌కు వచ్చి, ఇక్కడి వ్యక్తినే పెళ్లి చేసుకుని ఇక్కడే ఉంటోంది. తాజాగా ఆమె పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన పోలీసు శాఖలో కలకలం రేపింది. ఆ మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని బరేలీ(Bareilly)లో మూడు దశాబ్దాలుగా ఓ బంగ్లాదేశ్‌ మహిళ అక్రమంగా నివసిస్తోంది. 30 ఏళ్ల కిందట ఆమె అక్రమంగా భారత్‌కు వచ్చి, ఇక్కడి వ్యక్తినే పెళ్లి చేసుకుని ఇక్కడే ఉంటోంది. తాజాగా ఆమె పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన పోలీసు శాఖలో కలకలం రేపింది. ఆ మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు. బంగ్లాదేశ్‌లోని జోధోపూర్‌కు చెందిన అనితా దాస్‌(Anitha Das) అక్రమంగా ఇండియాకు వచ్చింది. దేవ్రానియాలోని ఉదయపూర్‌ గ్రామానికి చెందిన మంగళ్‌సేన్‌ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత అతడి భార్యగా ఇక్కడే నివాసం ఉంటోంది. ఇప్పుడామె వయసు 55 ఏళ్లు. 30 ఏళ్లుగా ఆమె ఇక్కడే ఉంటున్నప్పటికీ పోలీసులకు ఆ విషయం తెలియకపోవడం విశేషం. ఇప్పుడెలా బయటపడిదంటే.. అనితా దాస్‌ తల్లిదండ్రుల ఆరోగ్యం బాగోలేదు. వారిని చూడటానికి బంగ్లాదేశ్‌కు వెళ్లాలని అనుకుంది. బంగ్లాదేశ్‌కు వెళ్లేందుకు పాస్‌పోర్ట్ కోసం అప్లై చేసింది. దరఖాస్తులో ఆమె తన స్థానిక చిరునామాతో పాటు బంగ్లాదేశ్‌ అడ్రస్‌ కూడా రాసింది. అలాగే పాస్‌పోర్టులో పుట్టినస్థలం కాలమ్‌ ఉన్న చోట ఆమె బంగ్లాదేశ్‌ అని రాసింది. దాంతో ఆమె బంగ్లాదేశ్‌ నుంచి అక్రమంగా వచ్చిందని తెలిసింది. పాస్‌పోర్టు అప్లికేషన్‌ పరిశీలనలో అనితా దాస్ బంగ్లాదేశీ అని రుజువయ్యింది. వెంటనే నిఘా వర్గాలు రంగంలోకి దిగారు. ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆమెపై కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే అనితా దాస్‌ బంగ్లాదేశ్‌ నుంచి వచ్చిన విషయం తమకు తెలియదని గ్రామస్తులు అంటున్నారు. 30 ఏళ్లుగా ఆ గ్రామంలోనే ఉంటున్న అనితా దాస్‌కు అయిదుగురు సంతానం.

Updated On 7 Dec 2023 6:32 AM GMT
Ehatv

Ehatv

Next Story