కర్ణాటక రాజధాని బెంగళూరు(Bangalore) నగరం తీవ్ర నీటి ఎద్దడిని(Water crises) ఎదుర్కొంటున్నది. ఇంతకు ముందు ఎప్పుడూ లేనంతగా తాగునీటికి కొరత ఏర్పడింది. ఎంతగా అంటే హోటల్స్‌, రెస్టారెంట్‌ యజమానులు తమ ఆహార మెనూలో నీరు ఎక్కువగా వాడే వంటకాలను తొలగించేసేటంతగా! రసం, సాంబార్‌ మెనూలో కనిపించడం లేదక్కడ. యూజ్‌ అండ్‌ త్రో ప్లేట్లనే వాడుతున్నారు.

కర్ణాటక రాజధాని బెంగళూరు(Bangalore) నగరం తీవ్ర నీటి ఎద్దడిని(Water crises) ఎదుర్కొంటున్నది. ఇంతకు ముందు ఎప్పుడూ లేనంతగా తాగునీటికి కొరత ఏర్పడింది. ఎంతగా అంటే హోటల్స్‌, రెస్టారెంట్‌ యజమానులు తమ ఆహార మెనూలో నీరు ఎక్కువగా వాడే వంటకాలను తొలగించేసేటంతగా! రసం, సాంబార్‌ మెనూలో కనిపించడం లేదక్కడ. యూజ్‌ అండ్‌ త్రో ప్లేట్లనే వాడుతున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అక్కడ నీటి ఎద్దడి ఏ స్థాయిలో ఉందో! నగర ప్రజలు గుక్కెడి నీటి కోసం అల్లాడిపోతున్నారు. ప్రతీ ఇంటి ముందు నాలుగైదు డ్రమ్ములు, సింథటిక్‌ ట్యాంకులు కనిపిస్తున్నాయి. కొన్ని ఏరియాలలో ప్రజలు వారానికి ఓసారి స్నానం చేస్తున్నారట! బెంగళూరులో మొత్తం 13,900 బోరు బావులు ఉన్నాయి. ఇందులో ఇప్పటికే ఏడు వేల బోర్లు ఎండిపోయాయి. మిగిలిన బోర్లలో కూడా నీరు అడుగంటింది. మొన్నకు మొన్న మా ఇంట్లోని బోరుబావి కూడా ఎండిపోయిందంటూ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌(DK Shiva kumar) స్వయంగా చెప్పారు. భవన నిర్మాణాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ప్రభుత్వమే నిషేధం విధించింది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వాటర్‌ ఏటీఎంలు, ఆర్వో యూనిట్లను ప్రభుత్వం క్లోజ్‌ చేసింది. పనిచేస్తున్న ఒకటీ, రెండు యూనిట్లలో నీటి చార్జీలను రెట్టింపు చేసింది. ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించాల్సిన ప్రభుత్వం ఇలా డబ్బులు వసూలు చేయడమేమిటని జనం అనుకుంటున్నారు. నీటి సరఫరాను సవ్యంగా చేయలేకపోతున్న ప్రభుత్వాన్ని అపార్ట్‌మెంట్‌ వాసులు, గేటెడ్ కమ్యూనిటీల్లోని జనం తిట్టిపోస్తున్నారు. గతంలో 750 రూపాయలు ఉన్న నీటి ట్యాంకర్‌ ఇప్పుడు రెండు వేల రూపాయలయ్యింది. 20 రూపాయలున్న 20 లీటర్ల వాటర్‌ క్యాన్‌ ఇప్పుడు 100 నుంచి 120 రూపాయల ధరకు అమ్ముతున్నారు. నీటి కటకటను భరించలేని కొందరు టెకీలు, ప్రైవేటు ఉద్యోగులు బెంగళూరును వదిలిపెట్టి సొంతూరుకు వెళుతున్నారు. స్నానాలు చేయడం కోసమే కొందరు శివారు ప్రాంతాల్లోని కుంటలకు ప్రయాణమవుతున్నారట!

Updated On 11 April 2024 1:05 AM GMT
Ehatv

Ehatv

Next Story