రేవ్‌పార్టీకి(Rave Party) అటెండవ్వడానికి డాబు దస్కం రెండూ ఉండాలి. ఉన్నత మధ్య తరగతివారికి కూడా కష్టమే! ఏదైనా ఈవెంట్‌కో, సాదాసీదా పబ్‌కో వెళ్లాలంటే ఎంట్రీ ఫీజు ఓ అయిదు వందలుంటుంది. ఇంకాస్తా ఖరీదైన కార్యక్రమం అయితే వెయ్యో రెండు వేలో ఉంటుంది. కానీ రేవ్‌పార్టీలు అలా కాదు. గేటు దాటి లోపలకి వెళ్లాలంటే లక్షలు తగలేయాల్సి ఉంటుంది.
రేవ్‌పార్టీకి(Rave Party) అటెండవ్వడానికి డాబు దస్కం రెండూ ఉండాలి. ఉన్నత మధ్య తరగతివారికి కూడా కష్టమే! ఏదైనా ఈవెంట్‌కో, సాదాసీదా పబ్‌కో వెళ్లాలంటే ఎంట్రీ ఫీజు ఓ అయిదు వందలుంటుంది. ఇంకాస్తా ఖరీదైన కార్యక్రమం అయితే వెయ్యో రెండు వేలో ఉంటుంది. కానీ రేవ్‌పార్టీలు అలా కాదు. గేటు దాటి లోపలకి వెళ్లాలంటే లక్షలు తగలేయాల్సి ఉంటుంది. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు(Entry Fee) ఎంత అనుకుంటున్నారు? అక్షరాల 50 లక్షల రూపాయలు.. ఇందులో పాల్గొన్న 150 మంది చెరో 50 లక్షల రూపాయలు చెల్లించి పార్టీకి హాజరయ్యారట! ఈ విషయాన్ని పోలీసు కమిషనరే చెప్పారు. 50 లక్షలంటే మామూలు విషయం కాదు..మనలాంటివాళ్లు ఉండేందుకు ఓ కొంప వస్తుంది. అన్నట్టు 50 లక్షల రూపాయలు కేవలం ఎంట్రీ ఫీజు మాత్రమే.. లోపలికి వెళ్లాక ప్రత్యేకమైన సౌలభ్యాలు కావాలంటే అదనంగా మరికొంచెం సమర్పించుకోవాల్సి ఉంటుంది. డ్రగ్సో, కొకైనో కావాలంటే మాత్రం ఇంకా బోల్డంత డబ్బు ఖర్చు చేయాలి..