బెంగళూరు(Bangalore) ఎలక్ట్రానిక్ సిటీ(Electronic City) సమీపంలో రేవ్ పార్టీ(Rave party) కలకలం సృష్టించింది. ఆదివారం అర్థరాత్రి పుట్టినరోజు(Birthday) పేరుతో ఓ బడా వ్యాపారవేత్తకు చెందిన ఫామ్‌హౌస్‌లో(Farm house) రేవ్ పార్టీ జరిపారు. ఈ పార్టీలో పాల్గొన్న పలువురు తెలుగు సినీ, టీవీ నటీనటులు, మోడళ్లు పట్టుబడ్డారు. పోలీసుల దాడిలో మద్యంతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్(Drugs) కూడా దొరికాయి.
బెంగళూరు(Bangalore) ఎలక్ట్రానిక్ సిటీ(Electronic City) సమీపంలో రేవ్ పార్టీ(Rave party) కలకలం సృష్టించింది. ఆదివారం అర్థరాత్రి పుట్టినరోజు(Birthday) పేరుతో ఓ బడా వ్యాపారవేత్తకు చెందిన ఫామ్‌హౌస్‌లో(Farm house) రేవ్ పార్టీ జరిపారు. ఈ పార్టీలో పాల్గొన్న పలువురు తెలుగు సినీ, టీవీ నటీనటులు, మోడళ్లు పట్టుబడ్డారు. పోలీసుల దాడిలో మద్యంతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్(Drugs) కూడా దొరికాయి. రేవ్ పార్టీ జరిగిన జీఆర్ ఫామ్‌హౌస్ హైదరాబాద్ కాన్‌కార్డ్ సంస్థకు గోపాల్ రెడ్డికి(Gopal Reddy) చెందినదిగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఈ పార్టీని ఏర్పాటు చేసినట్లు, విమానంలో యువతీయువకులను తరలించినట్లు పోలీసులు నిర్ధారించారు. తెల్లవారుజామున మూడు గంటల వరకు జరుగుతున్న రేవ్ పార్టీపై పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. రేవ్ పార్టీలో పోలీసులకు భారీగా డ్రగ్స్, కోకైన్(cocoine) లభ్యమయ్యాయి. కర్ణాటక, తెలుగు రాష్ట్రాలకు చెందిన వంద మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్టీలో 25 మందికి పైగా యువతులు ఉన్నారు. సుమారు 15 విలువైన కార్లను పోలీసులు సీజ్ చేశారు. ఇదే పార్టీకి వచ్చిన ఓ కారులో ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి సంబంధించిన స్టిక్కర్ దొరికింది. బెంగళూరు సీసీబీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.