బెంగళూరు(Bangalure) ఎలక్ట్రానిక్ సిటీ(ELectronic city) జీఆర్ ఫామ్‌హౌజ్‌లో మొన్న ఆదివారం జరిగిన రేవ్‌పార్టీ(Rave party) రేపిన కలకలం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ రేవ్‌పార్టీలో పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు, నటీనటులు పాల్గొన్నారనే వార్తలు వచ్చాయి కానీ రాజకీయ నాయకులు పాల్గొన్నట్టు సమాచారమేమీ తమకు లేదన్నారు పోలీసులు.
బెంగళూరు(Bangalore) ఎలక్ట్రానిక్ సిటీ(ELectronic city) జీఆర్ ఫామ్‌హౌజ్‌లో మొన్న ఆదివారం జరిగిన రేవ్‌పార్టీ(Rave party) రేపిన కలకలం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ రేవ్‌పార్టీలో పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు, నటీనటులు పాల్గొన్నారనే వార్తలు వచ్చాయి కానీ రాజకీయ నాయకులు పాల్గొన్నట్టు సమాచారమేమీ తమకు లేదన్నారు పోలీసులు. ఇద్దరు నటులు మాత్రం పాల్గొన్నట్టు చెప్పారు. రేవ్ పార్టీకి డ్రగ్స్(Drugs) తీసుకొచ్చిన అయిదుగురిని అరెస్ట్ చేశామని బెంగళూరు సిటీ కమిషనర్ చెప్పారు. ఈ పార్టీలో చాలా మంది తెలుగువాళ్లు పాల్గొన్నట్టు ప్రచారం జరిగింది. నటి హేమ పేరు కూడా వినిపించింది. అయితే బెంగళూరు సీపీ మాత్రం ఇద్దరు నటులు మాత్రమే పాల్గొన్నట్టు చెప్పడంతో అనుమానం కలుగుతోంది. రేవ్ పార్టీలో పాల్గొన్నవారి పేర్లను ఎందుకో దాచిపెడుతున్నారని అనిపిస్తోంది. రాజకీయ ఒత్తిళ్లతో కేసును అటకెక్కిస్తున్నారనే డౌట్ వస్తోంది.