ఆన్‌లైన్‌ జాబ్స్(Online Jobs0), వర్క్‌ ఫ్రం హోం జాబ్స్‌(Wark from home Jobs), పార్ట్‌టైం జాబ్స్(Part time Jobs) అంటూ మోసాలకు ముఠాలు తెరలేపుతున్నాయి. తాజాగా ఇలాంటి ముఠా వ్యవహారం ఒకటి వెలుగులోకి వచ్చింది.

ఆన్‌లైన్‌ జాబ్స్(Online Jobs0), వర్క్‌ ఫ్రం హోం జాబ్స్‌(Wark from home Jobs), పార్ట్‌టైం జాబ్స్(Part time Jobs) అంటూ మోసాలకు ముఠాలు తెరలేపుతున్నాయి. తాజాగా ఇలాంటి ముఠా వ్యవహారం ఒకటి వెలుగులోకి వచ్చింది. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అంటూ మోసం చేసి రూ.158 కోట్ల కుంభకోణానికి పాల్పడిన ముఠాను బెంగళూరు పోలీసులు(Bangalore Police) అరెస్ట్ చేశారు. బెంగళూరుకు చెందిన అమీర్ సోహైల్(Ameer Sohail), ఇనాయత్ ఖాన్(Inayath Khan), ముంబైకి చెందిన సయ్యద్ అబ్బాస్ అలీ, మిథున్ మనీష్ షా, నైనా రాజ్, సతీష్, మిహిర్ శశికాంత్ షా, హైదరాబాద్‌కు చెందిన నయాజ్, ఆదిల్‌ను అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు అనుమానితుల కోసం గాలింపు చేపట్టారు.

ట్సాప్‌(Tasp), టెలిగ్రామ్(Telegram) ద్వారా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ జాబ్‌ల పేరుతో అమాయకులకు మెస్సేజ్‌లు చేసేవారు. యూట్యూబ్‌ వీడియోలకు లైక్‌ కొట్టడం, యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే చాలు.. మీకు డబ్బులే డబ్బులు అని చెప్పి నమ్మించారు. బాధితులకు చెందిన పలు డిజిటల్‌ వ్యాలెట్లలో అప్పుడప్పుడు కొంత డబ్బు వేసినట్లు చూపించారు. అయితే ఆ డబ్బును డ్రా చేసుకునేందుకు ప్రయత్నిస్తే అవి డ్రా కాలేదు. అంతే కాకుండా వారి డిజిటల్‌ వ్యాలెట్లలో ఉన్న డబ్బును కొల్లగొట్టారు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ బాధితుడు వీరి మోసాల బారినపడి దాదాపు రూ.18.50 లక్షలు పోగొట్టుకున్నాడు. ఇతడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నారు. నిందితులు లావాదేవీలు జరిపిన ఖాతాల్లో రూ.62.80 లక్షలను ఫ్రీజ్‌ చేశారు. ఇలా డబ్బు పొగొట్టుకున్నావారి సొమ్ము మొత్తం రూ.150 కోట్లు కొల్లగొట్టినట్లు విచారణలో తేలింది.

Updated On 5 Feb 2024 12:30 AM GMT
Ehatv

Ehatv

Next Story