కస్టమర్లను ఆకట్టుకునేందుకు దుకాణాదారులు తమ షాపులకు క్యాచీ నేమ్స్ పెట్టడం చూస్తూనే ఉంటాం. ఒకరికొకరు పోటీలు పడుతూ వినూత్నమైన పేర్లను తమ షాపులకు పెట్టుకుంటారు. తాజా ఇలాంటి పేరే ఒకటి సోషల్ మీడియాలో(Social media) ట్రెండ్ అవుతుంది. బెంగుళూరులోని(Bangalore) ఓ చాట్‌బండార్(Chat shop) నిర్వాహకుడు తన ఫుడ్ షాపునకు 'ఎక్స్-గర్ల్‌ఫ్రెండ్ బంగారుపే చాట్' అని పేరు పెట్టుకున్నాడు. ఇది సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది.
కస్టమర్లను ఆకట్టుకునేందుకు దుకాణాదారులు తమ షాపులకు క్యాచీ నేమ్స్ పెట్టడం చూస్తూనే ఉంటాం. ఒకరికొకరు పోటీలు పడుతూ వినూత్నమైన పేర్లను తమ షాపులకు పెట్టుకుంటారు. తాజా ఇలాంటి పేరే ఒకటి సోషల్ మీడియాలో(Social media) ట్రెండ్ అవుతుంది. బెంగుళూరులోని(Bangalore) ఓ చాట్‌బండార్(Chat shop) నిర్వాహకుడు తన ఫుడ్ షాపునకు 'ఎక్స్-గర్ల్‌ఫ్రెండ్ బంగారుపే చాట్'(Ex girlfriend Chat) అని పేరు పెట్టుకున్నాడు. ఇది సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది.
బెంగుళూరులోని ఆర్.టి.నగర్‌లో(RT Nagar) ఓ చాట్‌బండార్ నిర్వాహకుడు తన షాపునకు కస్టమర్లను ఆకర్షించేలా పేరు పెట్టాలనుకున్నాడు. బ్రేకపైన తర్వాత యువత తమ షాప్‌లో చాట్ తిని రిలాక్స్ కావొచ్చని చెప్తూ దానికి 'ఎక్స్-గర్ల్‌ఫ్రెండ్ బంగారుపే చాట్' అనే పేరుపెట్టాడు. అంతేకాకుండా బ్రేకప్(Breakup) తర్వాత ఇక్కడికి వెళ్లి థెరపీ పొందవచ్చని నిర్వాహకుడు చెప్తున్నాడు. బ్రేకప్ బాధలను మర్చిపోయేలా మెనూ కూడా ఇక్కడ ఉంటుందట. ఇక్కడ ప్లేట్ చాట్ తింటే తమకు ఓదార్పుదొరుకుతుందని వివరించాడు. దీనిని సోషల్ మీడియాలో పలువురు వినియోగదారులు పోస్టు చేస్తున్నారు.
బ్రేకప్ బాధలను మార్చిపోవాలంటే ఇక్కడికి వెళ్లి స్వాంతన పొందండి అని పలువురు సూచిస్తున్నారు. ఇక్కడి చాట్ రుచిని ఆస్వాదిస్తూ ప్రియురాలితో విడిపోయిన బాధలను మర్చిపోవచ్చని చెప్తున్నారు. అయితే కొందరేమో చాట్ తింటే బ్రేకప్ బాధలు ఎలా తొలగిపోతాయని.. షాపు నిర్వాహకుడు కేవలం చాట్ ప్రియులను ఆకర్షించుకోవచ్చన్న ఉద్దేశంతోనే ఇలాంటి పేరు పెట్టారని విమర్శిస్తున్నారు.