బెంగళూరు(Bangalore) మహానగరంలో నీటి ఎద్దడి(Water crises) భయంకరంగా ఉంది. బిందెడు నీళ్ల కోసం జనం నానా అగచాట్లు పడుతున్నారు. బోర్లు ఎండిపోయాయి. నగరంలో నీటి కష్టాలపై సోషల్ మీడియాలో నెటిజన్లు తమ గోడు చెప్పుకుంటున్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ట్యాగ్ చేస్తూ వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం కల్పించమని అభ్యర్థిస్తున్నారు.
బెంగళూరు(Bangalore) మహానగరంలో నీటి ఎద్దడి(Water crises) భయంకరంగా ఉంది. బిందెడు నీళ్ల కోసం జనం నానా అగచాట్లు పడుతున్నారు. బోర్లు ఎండిపోయాయి. నగరంలో నీటి కష్టాలపై సోషల్ మీడియాలో నెటిజన్లు తమ గోడు చెప్పుకుంటున్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ట్యాగ్ చేస్తూ వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం కల్పించమని అభ్యర్థిస్తున్నారు. నగరంలోని ఐటీ కంపెనీలు(IT companies) ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్(Work From Home) అవకాశాన్ని కల్పించేలా చూడాలని, పాఠశాలలు ఆన్‌లైన్ క్లాసులను మళ్లీ మొదలు పెట్టడానికి అనుమతించాలని ముఖ్యమంత్రిని కోరుతున్నారు. కరోనా స్వైరవిహారం చేస్తున్న సమయంలో ఉపయోగపడిన ఈ వ్యూహం ప్రస్తుత నీటి సంక్షోభంలో ఎందుకు ఉపయోగించుకోకూడదు అని ప్రశ్నిస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల అందరికీ ప్రయోజనాలు ఉన్నాయని, మండే ఎండల నుంచి ఉద్యోగులకు, విద్యార్థులకు కొంచెం ఉపశమనం కలుగుతుందని, ముఖ్యంగా నీటి సంరక్షణకు ఉపయోగపడుతుందని చెబుతున్నారు. వానకాలం మొదలయ్యే వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్‌ను పరిగణించాల్సిన అవసరం ఎంతో ఉందని గో బై కర్ణాటక వెదర్ అనే వాతావరణ ఔత్సాహికుల బృందం సూచిస్తున్నది. ఉద్యోగులను ఇంటి నుండి పని చేయడానికి అనుమతించడం వల్ల చాలా మంది తమ స్వస్థలాలకు వెళతారని, ఈ కారణంగా నీటి డిమాండ్‌ను కొంచెం అయినా తగ్గించవచ్చని చెబుతున్నారు.