భర్తను(Wife) ఉత్తిపుణ్యనికే ఆడిపోసుకుంటూ, అతడిని లేనిపోనివి అండగడుతూ ఉండటం కుదరదని కర్నాటక హైకోర్టు(Karnataka High court) చెప్పింది.

భర్తను(Wife) ఉత్తిపుణ్యనికే ఆడిపోసుకుంటూ, అతడిని లేనిపోనివి అండగడుతూ ఉండటం కుదరదని కర్నాటక హైకోర్టు(Karnataka High court) చెప్పింది. భర్తపై తప్పుడు ఆరోపణలతో కేసు పెట్టిన భార్య పట్ల అసహనం వ్యక్తం చేసింది. ఆమెపై కేసు పెట్టడానికి ఆమె భర్తకు వెసులుబాటు కల్పించింది. వివరాల్లోకి వెళితే అమెరికాలో ఉంటున్న వ్యక్తి ఇక్కడకి వచ్చి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి జరిగిన రెండు నెలల తర్వాత హెచ్‌ 1 బీ వీసా(H1B Visa) గడువు ముగియనుండటంతో తిరిగి అమెరికా వెళ్లిపోయాడు. తన భార్యను కూడా అమెరికాకు తీసుకెళ్లడానికి అయిదుసార్లు అపాయింట్‌మెంట్లకు ప్రయత్నించాడు. కానీ భార్య అమెరికాకు వెళ్లడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు. ఇలాగైతే లాభం లేదనుకుని 2021 డిసెంబర్‌ 3వ తేదీన విడాకుల కోసం బెంగుళూరులోని ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేసుకున్నాడు. దాంతో 2022 ఫిబ్రవరి 3వ తేదీన భర్తపై భార్య ఫిర్యాదు చేసింది. తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని ఆరోపించింది. మేజిస్ట్రేట్‌ కోర్టు 2022 జూన్‌ 14వ తేదీన దీనిని విచారణకు చేపట్టింది. భర్తపై కట్నం వేధింపుల ఆరోపణే కాకుండా లైంగిక రోగం కూడా ఉందని కోర్టుకు విన్నవించుకుంది. మరోవైపు రాజీ కోసం ప్రయత్నించినపుడు 3 కోట్ల రూపాయలు డిమాండ్‌ చేశారని భర్త ఆరోపించారు. వాద ప్రతివాదాలు విన్న తర్వాత జస్టిస్‌ నాగ ప్రసన్న ఈ కేసు వివరాలను పరిశీలించారు. భార్యకు స్త్రీ ధనంగా 614 గ్రాముల వెండి, 160 గ్రాముల బంగారం ఇచ్చారని తెలుసుకున్నారు. భార్య తల్లి, సోదరుడు ఇచ్చిన స్టేట్‌మెంట్లు, ఛార్జిషీటులోని వివరాలను పరిశీలించినపుడు భర్త వరకట్నం డిమాండ్‌ చేసినట్లు కాని, వేధించినట్టు కానీ ఎక్కడా వెల్లడి కాలేదని గుర్తించారు. ఈ కారణంగా భార్యపై కేసు పెట్టేందుకు ఆ భర్తకు అనుమతి ఇచ్చింది హైకోర్టు!

Eha Tv

Eha Tv

Next Story