బెంగళూరులో(Bangalore) ఓ మహిళా సీఈవో సుచనా సేథ్(Suchana Seth) తన నాలుగేళ్ల కొడుకును(son) హత్య(Murder) చేసిన కేసులో ఆమె రాసిన ఓ నోట్‌ను(Note) పోలీసులు(Police) స్వాధీనం చేసుకున్నారు. నోట్‌లోని కచ్చితమైన సమాచారాన్ని పోలీసులు వెల్లడించనప్పటికీ, నిందితురాలు సుచనా సేథ్ తన విడిపోయిన భర్తతో తనకున్న చేదు అనుభవాలను అందులో రాశారని సమాచారం. 39 ఏళ్ల ఆమె గోవాలోని(Goa) హోటల్ గదిలో తన కొడుకును హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
బెంగళూరులో(Bangalore) ఓ మహిళా సీఈవో సుచనా సేథ్(Suchana Seth) తన నాలుగేళ్ల కొడుకును(son) హత్య(Murder) చేసిన కేసులో ఆమె రాసిన ఓ నోట్‌ను(Note) పోలీసులు(Police) స్వాధీనం చేసుకున్నారు. నోట్‌లోని కచ్చితమైన సమాచారాన్ని పోలీసులు వెల్లడించనప్పటికీ, నిందితురాలు సుచనా సేథ్ తన విడిపోయిన భర్తతో తనకున్న చేదు అనుభవాలను అందులో రాశారని సమాచారం. 39 ఏళ్ల ఆమె గోవాలోని(Goa) హోటల్ గదిలో తన కొడుకును హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆమెకు వైద్య పరీక్షతోపాటు, ఫిజికల్ ఎనాలిసిస్ టెస్ట్ కూడా చేయనున్నారు. అయితే సుచనా సేథ్ విచారణకు సహకరించడం లేదని, అసలు ఆమెకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని పోలీసు వర్గాలు వెల్లడించాయి.
పోలీసులు స్వాధీనం చేసుకున్న నోట్‌ను టిష్యూ పేపర్‌పై ఐలైనర్‌తో రాసి ఉన్నట్లు తెలిపారు. ఈ నోట్‌ను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పోలీసులు పంపించారు. తన మాజీ భర్త వెంకట్ రామన్‌తో(Venkat Raman) ఉన్న చేదు జ్ఞాపకాలను, రామన్‌ను పిల్లవాడిని కలవడానికి అనుమతించిన కోర్టు ఉత్తర్వులపై అసంతృప్తిగా ఉన్నట్లు నోట్‌లో రాసినట్లు తెలుస్తోంది. గోవా కాండోలిమ్‌లోని అపార్ట్‌మెంట్‌లోని గదిలో సుచనా సేథ్ జనవరి 6న చేరి, జనవరి 8 వరకు అక్కడే ఉంది. తన కొడుకును అపార్ట్‌మెంట్‌లో చంపి, మృతదేహాన్ని బ్యాగ్‌లో పెట్టుకొని.. సోమవారం టాక్సీలో కర్నాటకకు తీసుకెళ్లిందని పోలీసులు తెలిపారు. అపార్ట్‌మెంట్ సిబ్బంది గదిని శుభ్రం చేసేందుకు వెళ్లగా టవల్‌పై రక్తపు మరకలు కనిపించాయి. సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సుచనా సేథ్ బరువైన బ్యాగ్‌ని తీసుకువెళ్లిందని, కుమారుడు ఆమెతో కనిపించ లేదని సిబ్బంది పోలీసులకు చెప్పారు.
'ది మైండ్‌ఫుల్ AI ల్యాబ్'కు సుచనా సేథ్ సీఈవోగా ఉన్నారు. లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ ప్రకారం, సుచనా సేథ్ AI ఎథిక్స్ నిపుణురాలు. డేటా సైంటిస్ట్, డేటా సైన్స్ టీమ్‌లను లీడ్ చేయడమే కాకుండా.. స్టార్ట్-అప్‌లలో మెషిన్ లెర్నింగ్ సొల్యూషన్‌లను స్కేలింగ్ చేయడంలో 12 సంవత్సరాల అనుభవం ఆమెకు ఉంది.