దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత(Jayalalitha) బంగారు ఆభరణాలపై బెంగళూరు(Jwellery) కోర్టు(Bangalore Court) కీలకతీర్పు ఇచ్చింది. ఆమెకు సంబంధించిన బంగారు ఆభరణాలను రాష్ర్ట ప్రభుత్వానికి అప్పగించాలని నిర్ణయించింది. ఆభరణాల అప్పగింతకు వచ్చే నెల 6వ తేదీ, 7వ తేదీలను ఖరారు చేసింది. ఆభరణాలను తీసుకెళ్లడానికి ఆరు ట్రంకు పెట్టెలతో రావాలని తమిళనాడు ప్రభుత్వాన్ని బెంగళూరులోని ప్రత్యేక కోర్టు ఆదేశించింది.

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత(Jayalalitha) బంగారు ఆభరణాలపై బెంగళూరు(Jwellery) కోర్టు(Bangalore Court) కీలకతీర్పు ఇచ్చింది. ఆమెకు సంబంధించిన బంగారు ఆభరణాలను రాష్ర్ట ప్రభుత్వానికి అప్పగించాలని నిర్ణయించింది. ఆభరణాల అప్పగింతకు వచ్చే నెల 6వ తేదీ, 7వ తేదీలను ఖరారు చేసింది. ఆభరణాలను తీసుకెళ్లడానికి ఆరు ట్రంకు పెట్టెలతో రావాలని తమిళనాడు ప్రభుత్వాన్ని బెంగళూరులోని ప్రత్యేక కోర్టు ఆదేశించింది. మొత్తం 27 కిలోల బంగారు, వజ్ర ఆభరణాలతో పాటు 700 కిలోలకు పైగా వెండి కూడా ఉందట! బంగారు ఆభరణాల అప్పగింతకు ఒక అధికారిని నియమించినట్టు కోర్టు తెలిపింది. ఈయనతో తమిళనాడు హోమ్‌ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఐజీపీ సమన్వయం చేసుకోవాలని సూచించింది. కోర్టు నుంచి ఆభరణాలను స్వాధీనం చేసుకునే సమయంలో ఫొటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్, ఆరు పెద్ద ట్రంకు పెట్టెలు, అవసరమైన భద్రత సిబ్బందితో రావాలని కోర్టు తెలిపింది. తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన జయలలితకు లెక్కకు మించి ఆస్తులున్నాయనే విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అక్రమార్జన కేసులో 1996లో చెన్నైలోని జయలలిత నివాసంలోంచి అధికారులు అనేక వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత అక్రమ కేసులో జయ దోషిగా తేలడంతో 2014లో బెంగళూరు కోర్టు నాలుగేళ్లు జైలు శిక్ష, 100 కోట్ల రూపాయల జరిమానా విధించారు. స్వాధీనం చేసుకున్న వస్తువులను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా లేదా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా లేదా బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని స్పష్టం చేసింది. అయితే అంతలోనే జయలలిత కన్నుమూశారు. . ఈ క్రమంలోనే దీనిపై మరోసారి విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు ఆ ఆభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి బదిలీ చేయాలని నిర్ణయించింది. అక్రమార్జన కేసులో 1996లో చెన్నైలోని జయ నివాసం నుంచి స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలతో పాటు అనేక విలువైన వస్తువులన్నీ కర్ణాటక ప్రభుత్వం ఆధీనంలోనే ఉన్నాయి. ఖరీదైన చెప్పులు, పట్టుచీరలు, వీడియో క్యాసెట్లు, లాకర్లతోపాటు పలు వస్తువులు కూడా ఉన్నాయి. అలాగే జయలలితకు సంబంధించిన 1.93 లక్షల రూపాయల నగదు కూడా ఉంది.

Updated On 20 Feb 2024 6:08 AM GMT
Ehatv

Ehatv

Next Story