టెక్ సిటీగా ఉన్న బెంగళూరును (Bangalore) ట్యాంకర్ సిటీగా కాంగ్రెస్ మార్చిందని కర్నాటక ప్రభుత్వంపై మోడీ (PM Modi) సెటైర్లు వేశారు. వ్యవసాయం నుంచి పట్టణ మౌలిక సదుపాయాలకు బడ్జెట్ కోత పెడుతోంది. కాంగ్రెస్ కేవలం అవినీతిపైనే దృష్టి పెడుతోంది, బెంగళూరు సమస్యలపై కాదు. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు మాత్రమే వేగంగా ముందుకు సాగుతున్నాయని మోడీ అన్నారు.
టెక్ సిటీగా ఉన్న బెంగళూరును (Bangalore) ట్యాంకర్ సిటీగా కాంగ్రెస్ మార్చిందని కర్నాటక ప్రభుత్వంపై మోడీ (PM Modi) సెటైర్లు వేశారు. వ్యవసాయం నుంచి పట్టణ మౌలిక సదుపాయాలకు బడ్జెట్ కోత పెడుతోంది. కాంగ్రెస్ కేవలం అవినీతిపైనే దృష్టి పెడుతోంది, బెంగళూరు సమస్యలపై కాదు. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు మాత్రమే వేగంగా ముందుకు సాగుతున్నాయని మోడీ అన్నారు. దేశాన్ని గ్రీన్ ఎనర్జీ హబ్, ఫార్మా హబ్, ఎలక్ట్రానిక్స్ హబ్, ఎలక్ట్రికల్ వెహికల్ హబ్, సెమీకండక్టర్ హబ్, గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌గా మారుస్తానని, తద్వారా భారతదేశం (Bharath) గ్లోబల్ ఎకానమీకి హబ్‌గా మారుతుందని మోడీ చెప్పారు. కర్ణాటక ప్రజల కలలను సాకారం చేసేందుకు బీజేపీ, జనతాదళ్ సెక్యులర్‌లు ఒక్కటిగా కలిసి వచ్చాయని ప్రధాన మంత్రి అన్నారు. "మీ కలలే నా సంకల్పం అని నేను హామీ ఇస్తున్నా. నా జీవితం మీకు, దేశానికి అంకితం చేస్తున్నానని మోడీ అన్నారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చే లక్ష్యం పెట్టుకున్నామన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేస్తున్న ఆలోచనలు, భావజాలం చాలా ప్రమాదకరం. మా కూతుళ్లపై దాడులు జరుగుతున్నాయి, మార్కెట్‌లలో బాంబులు పేలుతున్నాయి, మతపరమైన పాటలు వింటున్నందుకు ప్రజలపై దాడులు జరుగుతున్నాయి, ఇలాంటి ఘటనలు మామూలే. కాంగ్రెస్ పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని నేను నా సోదరులు మరియు సోదరీమణులను కోరుతున్నాఅని మోడీ అన్నారు. హుబ్బలిలో కాంగ్రెస్ నాయకుడి 21 ఏళ్ల కుమార్తె హత్య, బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో (Rameshwaram Cafe) పేలుడు, దాడి నేపథ్యంలో మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని మోడీ వ్యాఖ్యలపై సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah) ఘాటుగా స్పందించారు. ప్రధాని నిజంగా రైతుల శ్రేయోభిలాషి అయితే తన మనస్సాక్షిని అడగాలని సిద్ధరామయ్య అన్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో 2020-21 రైతుల ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ, నిరసనలో మరణించిన 700 మంది రైతుల గురించి ఎందుకు మాట్లాడరని అన్నారు. రైతుల గురించి మాట్లాడే నైతికత ప్రధానికి లేదన్నారు. కనీస మద్దతు ధరకు హామీ ఇచ్చేలా చట్టం చేయాలన్న రైతుల డిమాండ్‌ను నెరవేర్చేందుకు కేంద్రం ఇప్పటికీ సిద్ధంగా లేదని, విత్తనాలు, ఎరువులపై జీఎస్టీ విధించిందని అన్నారు. బీజేపీ మొదటి నుంచి రైతు వ్యతిరేకి అన్నారు. పెట్టుబడిదారులు, వ్యాపారులు, వ్యాపారుల పార్టీ అని, ఈ పార్టీ డీఎన్‌ఏలో రైతు వ్యతిరేక విషం ఉందని, పదేళ్ల పాలనలో నరేంద్ర మోదీ ప్రభుత్వం కర్నాటక రైతులకు ఏం ఇచ్చిందని సిద్ధరామయ్య ప్రశ్నించారు. కర్ణాటక రైతులు తమ శ్రేయోభిలాషి ఎవరో అర్థం చేసుకునేంత మేధావులని, రైతు వ్యతిరేక శక్తులకు ఎన్నికల్లో గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు.