జనవరి 22న జరగనున్న రామ మందిర(Rama Mandir) విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని వివాదాస్పదం చేయడం ద్వారా ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ(MP Asaduddin Owaisi) రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ(BJP) జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay) కుమార్ ఆరోపించారు.

బుధవారం కరీంనగర్ చైతన్యపురి కాలనీలో ఇంటింటికి రాములవారి అక్షింతలు పంపిణీ చేసిన సందర్భంగా సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. వివాదాస్పద ప్రకటనలు చేస్తూ ముస్లిం యువతను రెచ్చగొట్టేందుకు ఒవైసీ ప్రయత్నిస్తున్నారని అన్నారు. శ్రీరామ ట్రస్టు ఆధ్వర్యంలో అయోధ్య(Ayodhya) నుంచి అక్షింతలు తెప్పించినట్లు వెల్లడించారు.
రామమందిర నిర్మాణంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును దేశవ్యాప్తంగా ముస్లిం మత పెద్దలు కూడా వ్యతిరేకించలేదని సంజయ్ కుమార్ అన్నారు. రాజకీయాలకు అతీతంగా దేశంలోని హిందువులు తమ వంతు సహకారం అందించి అద్భుతమైన రామమందిరాన్ని నిర్మించారు. శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం కోసం తాము ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని చెప్పారు.