నెలరోజుల గ్యాప్‌లోనే 11 వందల క్వింటాళ్ల చక్కెర(Sugar) మాయం అయ్యింది. కోతులు(Monkey) తిన్నాయంటున్నారు అధికారులు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో(Uttar Pradesh) జరిగింది. ఆ చక్కెర విలువ సుమారు 35 లక్షల రూపాయలు ఉంటుంది. ఇంత చక్కెరను కోతులు ఎలా తిన్నాయి? అని ఆశ్చర్యపోకండి.. ఆ పని చేసింది మనుషులే! అలీఘర్‌లో(Aligarh) ఉన్న బందర్ సాథ షుగర్ మిల్లులో(Bandar Saatha Sugar Mill) ఇలా చక్కెర మాయం అయ్యింది.
నెలరోజుల గ్యాప్‌లోనే 11 వందల క్వింటాళ్ల చక్కెర(Sugar) మాయం అయ్యింది. కోతులు(Monkey) తిన్నాయంటున్నారు అధికారులు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో(Uttar Pradesh) జరిగింది. ఆ చక్కెర విలువ సుమారు 35 లక్షల రూపాయలు ఉంటుంది. ఇంత చక్కెరను కోతులు ఎలా తిన్నాయి? అని ఆశ్చర్యపోకండి.. ఆ పని చేసింది మనుషులే! అలీఘర్‌లో(Aligarh) ఉన్న బందర్ సాథ షుగర్ మిల్లులో(Bandar Saatha Sugar Mill) ఇలా చక్కెర మాయం అయ్యింది. దానికి అధికారులు చెప్పిన కారణమేమిటంటే అక్కడి కోతులు పెద్ద మొత్తంలో చక్కెరను బుక్కేశాయట! ఇలాగని షుగర్ మిల్స్ లిమిటెడ్ ఆడిట్ నివేదికలో చెప్పారు. ది కిసాన్ కోపరేటివ్ షుగర్ మిల్ లిమిటెడ్ లో ఇటీవల జిల్లా ఆడిట్ అధికారులు, సహకార సంఘాలు, పంచాయతీ ఆడిట్ అధికారులు ఆడిట్ నిర్వహించారు. అప్పుడు తెలిసింది చక్కెర మాయమైన సంగతి. మాయం చేసింది అవినీతి అధికారులే! కోతులు తిన్నాయని, వర్షం కారణంగా చక్కెర పాడైపోయిందని చెప్పుకొచ్చారు. ఈ స్కామ్‌లో మేనేజర్, అకౌంట్స్ ఆఫీసర్‌తో పాటు ఆరుగురు ఉన్నారు. వారు అక్రమంగా కాజేసిన చక్కెర విలువను వారి నుంచే రాబడతామని సహకార సంఘాల అసిస్టెంట్ ఆడిట్ అధికారి అంటున్నారు.