పాకిస్తాన్‌(Pakistan) ఏర్పడినప్పటి నుంచే బలూచిస్తాన్‌(Balochistan) ప్రజలలో ఓ రకమైన అసంతృప్తి, అపనమ్మకం ఏర్పడ్డాయి. న్యాయంగా తమకు దక్కాల్సినవేవీ దక్కడం లేదన్న ఆగ్రహమూ వారిలో కలిగింది. అదే వేర్పాటువాదానికి దారి తీసింది. స్వతంత్రంగా ఉండాలనే ఆకాంక్ష క్రమక్రమంగా బలపడుతూ వచ్చింది. బలూచిస్తాన్‌ వేర్పాటువాద ఉద్యమం ఎప్పటి నుంచే ఉంది. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా పని చేస్తున్న రెండు పెద్ద బలూచిస్తాన్‌ వేర్పాటువాద సంస్థలు మరికొద్ది రోజుల్లో ఒక్కటి కాబోతున్నాయి.

పాకిస్తాన్‌(Pakistan) ఏర్పడినప్పటి నుంచే బలూచిస్తాన్‌(Balochistan) ప్రజలలో ఓ రకమైన అసంతృప్తి, అపనమ్మకం ఏర్పడ్డాయి. న్యాయంగా తమకు దక్కాల్సినవేవీ దక్కడం లేదన్న ఆగ్రహమూ వారిలో కలిగింది. అదే వేర్పాటువాదానికి దారి తీసింది. స్వతంత్రంగా ఉండాలనే ఆకాంక్ష క్రమక్రమంగా బలపడుతూ వచ్చింది. బలూచిస్తాన్‌ వేర్పాటువాద ఉద్యమం ఎప్పటి నుంచే ఉంది. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా పని చేస్తున్న రెండు పెద్ద బలూచిస్తాన్‌ వేర్పాటువాద సంస్థలు మరికొద్ది రోజుల్లో ఒక్కటి కాబోతున్నాయి. బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్(Balochistan Liberation Front), బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(Balochistan Liberation Army) అనే ఈ రెండు సంస్థల మధ్య ఇప్పటికే ఏకాభిప్రాయం కుదిరింది. ఎవరు నాయకత్వం వహించాలన్నదానిపైనే ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కలాత్‌ రాష్ట్రం పాకిస్తాన్‌లో విలీనమైనప్పటి నుంచి ఆ ప్రాంతంలో స్వతంత్రం(Freedom) కాంక్ష మొదలయ్యింది. ఇటీవల గ్వాదర్‌ ఓడ(Gwadar ship) రేపు నిర్మాణంతో బలూచిస్తాన్‌ ఉద్యమంలో వేడి పెరిగింది. నయీ ప్రాంతంలో ఓ మహిళా డాక్టర్‌పై లైంగికదాడి జరిగిందన్న వార్త పొక్కిన తర్ఆత ఉద్యమం ఊపందుకుంది. ఉద్యమానికి నవాబ్‌ అక్బర్‌ బుగ్తీ(Nawab Akbar Bugti) నాయకత్వం వహిస్తున్నారు. అత్యాచార సంఘటన తర్వాత బలూచిస్తాన్‌ ప్రజల్లో పాకిస్తాన్‌ అంటే ఏహ్యభావం ఏర్పడింది. బలూచిస్తాన్‌ యువకులు అదృశ్యమవుతుండటం కూడా ఆ ప్రజల్లో అలజడి ఏర్పడటానికి కారణమయ్యింది. ప్రస్తుతం బలూచ్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌, బలూచి లిబరేషన్‌ ఆర్మీ, బలూచ్‌ రిపబ్లికన్‌ గార్డ్‌, బలూచి లిబరేషన్స్‌ టైగర్స్‌, బలూచ్‌ నేషనలిస్ట్‌ ఆర్మీ, యునైటెడ్‌ బలూచ్‌ ఆర్మీ అనే సంస్థలు యాక్టివ్‌గా పని చేస్తున్నాయి. వీటిలో బలూచ్ లిబరేషన్ ఫ్రంట్, బలూచ్ లిబరేషన్ ఆర్మీ, బలూచ్ రిపబ్లికన్ గార్డ్ సంస్థలు బ్రాస్ అనే పేరుతో ఒక ఉమ్మడి సంస్థగా పని చేస్తున్నాయి.మిగతా సంస్థలు కూడా ఒకదానితో ఒకటి సహకరిస్తూ వస్తున్నాయి. వీటన్నింటి లక్ష్యం ఒక్కటే .. బలూచిస్తాన్‌కు స్వాతంత్రం తేవడం! తీవ్రవాద సంస్థలన్నీ ఒక్కటవ్వడంతో పాకిస్తాన్‌కు ఆందోళన మొదలయ్యింది. బలూచి వేర్పాటువాద సంస్థలన్నీ ఒక్కతాటి మీదకు వస్తే దానికి ఎవరు నాయకత్వం వహించాలన్న దానిపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఇవి కొలిక్కి వస్తే నాయకుడు ఎవరో తెలుస్తుంది. మొత్తంగా పాకిస్తాన్‌లో మాత్రం భయాందోళనలను మొదలయ్యాయి.

Updated On 28 Nov 2023 6:24 AM GMT
Ehatv

Ehatv

Next Story