తమిళనాడులోని మెట్టుపాళయంలో బేకరీ యజమాని ఊహించని ప్రమాదం నుండి

తమిళనాడులోని మెట్టుపాళయంలో బేకరీ యజమాని ఊహించని ప్రమాదం నుండి తప్పించుకున్నాడు. అతడి దుకాణంపైకి బైక్ దూసుకుని వచ్చింది. అదేదో హాలీవుడ్ సినిమాలో బైక్ ఎగురుకుంటూ వచ్చినట్లు శనివారం నాడు ఓ బేకరీ యజమాని మీదకు బైక్ వచ్చేసింది. బైక్ బేకరీలోకి దూసుకెళ్లి, లోపల ఉన్న వస్తువులను ధ్వంసం చేయడానికి కొద్ది క్షణాల ముందు ఆ వ్యక్తి తన సీటులోంచి పక్కకు వచ్చేయడం CCTV ఫుటేజీలో చూడొచ్చు. బైకర్‌ను మహమ్మద్‌ అలీగా గుర్తించారు. అతని బైక్ మరొక ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది, ఆ వాహనం వేగంగా బేకరీలోకి వచ్చేసింది.

అలీకి తీవ్ర గాయాలు అవ్వగా.. స్థానికులు అలీని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అలీ కట్టూరు నుంచి సిరుముగై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి బేకరీలోని సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బేకరీ యజమాని కౌంటర్ నుండి దూరంగా వెళ్లి కూర్చోవడానికి ముందు కస్టమర్లకు కావాల్సిన వస్తువులు ఇస్తూ కనిపించాడు. ఆ తర్వాత రోడ్డు వైపు చూసి కాసేపు కూర్చున్నాడు. ఇంతలో అతడు ఆ చైర్ మీద నుండి లేచి పక్కకు వెళ్ళాడు. అంతలోనే బైక్ మాత్రమే వచ్చి.. బేకరీలోకి ఎగిరి పడింది.

Updated On 11 March 2024 12:07 AM GMT
Yagnik

Yagnik

Next Story