మధ్యప్రదేశ్(Madhya Pradesh) అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీకి(BJP) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జోతిరాధిత్య‌ సింధియా(Jyotiraditya Scindia) మద్దతుదారు, శివపురి ఎమ్మెల్యే బైజ్‌నాథ్ సింగ్ యాదవ్ (Baijnath Singh Yadav) తన మద్దతుదారులతో కలిసి కాంగ్రెస్‌లో(congress) చేరారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో.. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్ నాథ్ బైజ్‌నాథ్ సింగ్‌ యాదవ్‌కు పార్టీ సభ్యత్వం ఇచ్చారు.

మధ్యప్రదేశ్(Madhya Pradesh) అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీకి(BJP) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జోతిరాధిత్య‌ సింధియా(Jyotiraditya Scindia) మద్దతుదారు, శివపురి ఎమ్మెల్యే బైజ్‌నాథ్ సింగ్ యాదవ్ (Baijnath Singh Yadav) తన మద్దతుదారులతో కలిసి కాంగ్రెస్‌లో(congress) చేరారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో.. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్ నాథ్ బైజ్‌నాథ్ సింగ్‌ యాదవ్‌కు పార్టీ సభ్యత్వం ఇచ్చారు. బైజ్‌నాథ్ సింగ్‌తో పాటు వందలాది మంది కార్యకర్తలు కూడా కాంగ్రెస్‌లో చేరారు. 15 జిల్లాలకు పైగా సభ్యులతో.. వందలాది మంది మద్దతుదారులతో కలిసి 400 కార్ల భారీ కాన్వాయ్‌తో కార్యాల‌యానికి చేరుకున్న‌ బైజ్‌నాథ్.. క‌మ‌ల్ నాథ్(kamalnath) స‌మ‌క్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాన్వాయ్ వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది. జ్యోతిరాధిత్య సింధియాతో కలిసి పార్టీ మారిన నేతల్లో బైజ్‌నాథ్ సింగ్‌ యాదవ్ ఒక‌రు. బీజేపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయ‌న సొంత‌గూటికే చేరుకోవ‌డం విశేషం. బైజ్‌నాథ్ సింగ్‌ యాదవ్ చేరిక‌.. కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది.

ఈ సందర్భంగా పీసీసీ(PCC) చీఫ్ కమల్ నాథ్ మాట్లాడుతూ.. నేటి రాష్ట్ర ప‌రిస్థితి మీ అందరి క‌ళ్ల‌ ముందు ఉంది. శివరాజ్ సింగ్, బీజేపీ ప్రభుత్వం తప్పుదోవ పట్టించే రాజకీయాలు చేస్తున్నాయి. ఎంతోమంది అక్కాచెల్లెళ్లు, ఉద్యోగులు, అంగన్‌వాడీ కార్యకర్తలు కన్నుమూశారు. యువత భవిష్యత్తు సురక్షితంగా లేదు, రాజ్యాంగానికి ముప్పు పొంచి ఉందన్నారు. మనమందరం రాజ్యాంగ పరిరక్షకులుగా ఉండాలి. భవిష్యత్తు మీ అందరిది. బీజేపీ తప్పుదోవ పట్టించే రాజకీయాలు మానుకోవాలని సూచించారు.

Updated On 15 Jun 2023 1:54 AM GMT
Ehatv

Ehatv

Next Story