ఈరోజుల్లో వివాహ బంధానికి(Marriage) విలువే లేకుండా పోతుంది. పాశ్చాత్య పోకడలకు అలవాటు పడి చక్కని కాపురాల్లో చిచ్చుపెట్టుకుంటున్నారు. భారతదేశంలో వివాహ బంధానికి ఎంత ప్రాధాన్యత ఉందో తెల్సిందే. అలాంటి సాంప్రదాయాలకు కొందరు తూట్లుపొడుస్తున్నారు. తాజాగా ఇద్దరు యువతులు స్నేహితురాళ్లు. పరస్పర అంగీకారంతో భర్తలను మార్చుకొని(Husband exchange) ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇలా నాలుగేళ్లపాటు వివాహేతర సంబధాలు ఏర్పర్చుకొని ఆ జంట.. ఈ జంట ఎంజాయ్‌ చేస్తూ వచ్చారు.

ఈరోజుల్లో వివాహ బంధానికి(Marriage) విలువే లేకుండా పోతుంది. పాశ్చాత్య పోకడలకు అలవాటు పడి చక్కని కాపురాల్లో చిచ్చుపెట్టుకుంటున్నారు. భారతదేశంలో వివాహ బంధానికి ఎంత ప్రాధాన్యత ఉందో తెల్సిందే. అలాంటి సాంప్రదాయాలకు కొందరు తూట్లుపొడుస్తున్నారు. తాజాగా ఇద్దరు యువతులు స్నేహితురాళ్లు. పరస్పర అంగీకారంతో భర్తలను మార్చుకొని(Husband exchange) ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇలా నాలుగేళ్లపాటు వివాహేతర సంబధాలు ఏర్పర్చుకొని ఆ జంట.. ఈ జంట ఎంజాయ్‌ చేస్తూ వచ్చారు. నాలుగేళ్ల తర్వాత భర్తతో విభేదాలు రావడంతో లక్నో కోర్టుకు(Lucknow) ఎక్కింది ఓ మహిళ. వివరాల్లోకి వెళ్తే..

బహ్రైచ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా(Software engineer) పనిచేస్తున్న యువతికి 2019లో సాఫ్ట్‌వేర్‌ రంగంలోనే ఉన్న ఓ యువకుడితో వివాహం జరిగింది.
ఇద్దరూ టెకీలే కావడంతో పాశ్చాత్యపోకడలకు అలవాటుపడ్డారు. ఈ క్రమంలోనే నాలుగేళ్ల క్రితం యువతి తన భర్తను తీసుకుని స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. స్నేహితురాలి భర్త కూడా అక్కడే ఉన్నాడు. నలుగురు కలిసి విందు ఆరగించారు. క్రమక్రమంగా ఈ జంటల మధ్య యాక్సెస్‌ బాగా పెరిగింది. ఆ ఏడాది డిసెంబర్ 25న ఈ నలుగురు కలిసి క్రిస్మస్ పండగ చేసుకున్నారు. అంతేకాకుండా ఏకంగా ఈ ఇద్దరు తమ భర్తలను మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఒకరి భర్తతో మరొకరు ఎంజాయ్‌ చేశారు. ఇక అప్పటి నుంచి నాలుగేళ్ల పాటు ఈ నలుగురు కలిసి ఎంజాయ్‌ చేశారు. అయితే ఓ యువతి భర్త తన స్నేహితురాలితో ప్రేమలో పడ్డాడని తెలియడంతో ఈ విషయాన్ని భర్తను, తన స్నేహితురాలను నిలదీసింది. ఈ రెండు జంటల మధ్య దూరం పెరిగింది. విడాకులు తీసుకోకుండా తన భర్త మరో మహిళను పెళ్లి చేసుకున్నాడని బహ్రైచ్‌ ఆరోపిస్తోంది. ఈ విషయంపై భర్తతో చాలాసార్లు గొడవపెట్టుకునేది. అతడిపై ఫిర్యాదు కూడా చేసింది. దీంతో బహ్రైచ్‌ యువతి భర్త లక్నో ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఆ తర్వాత లక్నో కోర్టు ఈ జంటకు కౌన్సెలింగ్‌ ఇప్పించి పంపించేశారు. అయితే తాను ఎవరినీ పెళ్లి చేసుకోలేదని బహ్రైచ్‌కు చెందిన యువతి భర్త చెప్తున్నాడు.

Updated On 30 Jan 2024 2:29 AM GMT
Ehatv

Ehatv

Next Story