రాజస్తాన్‌(Rajasthan)లోని కోటాలో(Kota) విద్యార్థుల(Students) వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఉన్నత చదువులు, ఉద్యోగాల కోచింగ్‌ సెంటర్లకు కోటా (Kota) ఫేమస్‌. ఇప్పుడదే విద్యార్థుల ఆత్మహత్యలకు కేంద్ర బిందువవుతోంది. ఒత్తిడి(Pressure) తట్టుకోలేక ఇప్పటికే చాలా మంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. తాజాగా మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.

రాజస్తాన్‌(Rajasthan)లోని కోటాలో(Kota) విద్యార్థుల(Students) వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఉన్నత చదువులు, ఉద్యోగాల కోచింగ్‌ సెంటర్లకు కోటా (Kota) ఫేమస్‌. ఇప్పుడదే విద్యార్థుల ఆత్మహత్యలకు కేంద్ర బిందువవుతోంది. ఒత్తిడి(Pressure) తట్టుకోలేక ఇప్పటికే చాలా మంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. తాజాగా మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మధ్యప్రదేశ్‌లోని రేవాకు చెందిన బిగీషా తివారీ (Bagisha Tiwari) అనే 18 ఏళ్ల అమ్మాయి తన తల్లి, సోదరుడితో కలిసి కోటాలోని జవహర్‌నగర్‌ ప్రాంతంలో నివాసం ఉంటోంది. నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌కు ఆమె ప్రిపేర్‌ అవుతున్నది. ఇందుకోసం కోటాలో కోచింగ్‌ తీసుకుంటోంది. మంగళవారం NEET-UG ప్రవేశ పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి.బుధవారం సాయంత్రం ఆఅ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది.తాను ఉంటున్న భవనంపై నుంచి దూకి చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. బిగీషా మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మహారావ్‌ భీమ్‌ సింగ్‌ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విద్యార్థి మృతికిగల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. కోటాలో ఈ ఏడాది ఇప్పటికే 11 మంది ఆత్మహత్య(Suicide) చేసుకున్నారు. లాస్టియర్‌ అయితే ఏకంగా 30 మంది వరకు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు.

Updated On 6 Jun 2024 1:47 AM GMT
Ehatv

Ehatv

Next Story