ఉత్తరాది రాష్ట్రాలలో భారీ వర్షాలు(heavy rains) బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి.
ఉత్తరాది రాష్ట్రాలలో భారీ వర్షాలు(heavy rains) బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. కొండ చరియలు విరిగిపడుతున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తరాఖండ్‌లో(Uttarakhand) అయితే వర్షాలు ముంచెత్తుతున్నాయి. కొండచరియలు విరిగిపడుతుండటంతో ముందు జాగ్రత్త చర్యగా అధికారులు 260కి పైగా రోడ్లు మూసేశార(Roads Closed). చమోలి జిల్లాలో బుధవారం బద్రీనాథ్ యాత్రకు వెళ్లే దారిని కలిపే జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. దాంతో ఆ రోడ్డును మూసేశారు. ఈ రోడ్డు మూతపడటంతో బద్రీనాథ్, జోషిమఠ్, నీతి, మన, తపోవన్, మలారి, లత, రాయిని, పాండుకేశ్వర్, హేమకుండ్ సాహిబ్‌లతో కనెక్టివిటి తెగిపోయింది. సుమారు రెండు వేల మంది యాత్రికులు జాతీయ రహదారిపై చిక్కుకుపోయారు.
రాష్ట్ర వ్యాప్తంగా అయిదు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ చెబుతుంది. ఈ నేపథ్యంలో చార్‌దామ్ యాత్రికులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.