యోగా గురువు బాబా రాందేవ్‌(Baba RamDev) స్టార్‌ రెజ్లర్ల(Star Wrestlers) పక్షాన నిలిచారు. జాతీయ రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ను(Brij Bhushan) అరెస్ట్‌ చేయాల్సిందేనన్నారు. ఇది నిజంగానే అనూహ్య, ఆశ్చర్యకర పరిణామం.

యోగా గురువు బాబా రాందేవ్‌(Baba RamDev) స్టార్‌ రెజ్లర్ల(Star Wrestlers) పక్షాన నిలిచారు. జాతీయ రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ను(Brij Bhushan) అరెస్ట్‌ చేయాల్సిందేనన్నారు. ఇది నిజంగానే అనూహ్య, ఆశ్చర్యకర పరిణామం. బ్రిజ్‌ భూషణ్‌ను పదవి నుంచి తొలగించి, అతడిపై చర్యలు తీసుకోవాలన్నది రెజ్లర్ల డిమాండ్‌. ఈ డిమాండ్‌తోనే గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. వీరికి రామ్‌దేవ్‌ బాబా మద్దతు ఇచ్చారు.

రాజస్థాన్‌లోని(Rajasthan) భిల్వారాలో మూడు రోజుల పాటు జరుగుతున్న యోగా కార్యక్రమాలకు హాజరైన బాబా రామ్‌దేవ్‌ మీడియాతో ముచ్చటించారు. 'బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌సింగ్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ టాప్‌ రెజ్లర్లు జంతర్‌మంతర్‌(Janthar Manthar) దగ్గర నిరసనలు చేపడుతున్నారు. ఇలాంటి పరిస్థితి రావడం సిగ్గు చేటు. బ్రిజ్‌భూషణ్‌ లాంటి వ్యక్తులను వెంటనే అరెస్ట్‌ చేసి జైల్లో పెట్టాలి.

అతడు తల్లులు, బిడ్డలు, అక్కచెల్లెళ్ల గురించి ప్రతి రోజూ అర్థం లేని మాటలు మాట్లాడుతున్నాడు. అతడి వైఖరిని ఖండించాలి' అని బాబా రామ్‌దేవ్‌ వ్యాఖ్యానించారు. ఇంతకు ముందు కూడా బాబా రామ్‌దేవ్‌ రెజ్లర్ల ఆందోళనపై స్పందించారు. రెజ్లర్లు ఒలింపిక్స్‌లో(Olympics) పతకాలు తెచ్చి దేశానికి ఖ్యాతి తెచ్చినప్పుడు ఆనందించాం. సంబరాలు చేసుకున్నాం. ఇప్పుడు వారు న్యాయం కోసం పోరాడుతున్నారు.

ఇలాంటి సమయంలో వారికి మనం అండగా నిలవాలి. రెజ్లింగ్‌ సమాఖ్య చీఫ్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించాలి' అని ట్వీట్‌ చేశారు బాబా రామ్‌దేవ్‌. బ్రిజ్‌ భూషణ్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయినప్పటికీ అరెస్ట్‌ కాలేదని, ఈ విషయంలో తాను ప్రకటనలు మాత్రమే చేయగలనని యోగా గురు అన్నారు. అతడిని జైలులో పెట్టే అధికారం తనకు లేదని వ్యాఖ్యానించారు.

Updated On 27 May 2023 4:33 AM GMT
Ehatv

Ehatv

Next Story