ఎస్పీ నేత మహ్మద్ ఆజం ఖాన్(Azam Khan) ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో ఢిల్లీ(Delhi)లోని సర్ గంగారామ్ ఆసుపత్రి(Gangaram Hospital)లో చేరారు. ప్రస్తుతం వైద్యుల ప‌రిశీల‌న‌లో ఉన్న ఆయ‌న ఆరోగ్య‌ పరిస్థితి నిలకడగా ఉంది. ఇంతకు ముందు కూడా ఆజం ఖాన్ చాలా సార్లు అనారోగ్యం పాల‌య్యారు. ఆ త‌ర్వాత కోలుకున్న ఆయ‌న మ‌ర‌లా అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. విద్వేషపూరిత ప్రసంగం కేసులో కోర్టు శిక్ష విధించడంతో అజంఖాన్ అసెంబ్లీ సభ్యత్వం కూడా కోల్పోవడం గమనార్హం

ఎస్పీ నేత మహ్మద్ ఆజం ఖాన్(Azam Khan) ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో ఢిల్లీ(Delhi)లోని సర్ గంగారామ్ ఆసుపత్రి(Gangaram Hospital)లో చేరారు. ప్రస్తుతం వైద్యుల ప‌రిశీల‌న‌లో ఉన్న ఆయ‌న ఆరోగ్య‌ పరిస్థితి నిలకడగా ఉంది. ఇంతకు ముందు కూడా ఆజం ఖాన్ చాలా సార్లు అనారోగ్యం పాల‌య్యారు. ఆ త‌ర్వాత కోలుకున్న ఆయ‌న మ‌ర‌లా అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. విద్వేషపూరిత ప్రసంగం కేసులో కోర్టు శిక్ష విధించడంతో అజంఖాన్ అసెంబ్లీ సభ్యత్వం కూడా కోల్పోవడం గమనార్హం. అయితే కోర్టు నిర్ణయాన్ని ఆజం ఖాన్ సుప్రీంకోర్టు(Supreme Court)లో సవాలు చేశారు.

గత ఏడాది ఆగస్టులో ఆజం ఖాన్ న్యుమోనియా(Pneumonia)తో బాధపడుతూ లక్నోలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఆయ‌న‌ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉందని.. ఆయ‌న్ని పరీక్షించిన‌ వైద్యులు వెల్ల‌డించారు. 72 ఏళ్ల ఆజం ఖాన్ గత ఏడాది మే నెల‌లో కూడా సాధారణ వైద్య‌ప‌రీక్ష‌ల నిమిత్తం ఢిల్లీ ఆసుపత్రిలో చేరారు. చీటింగ్ కేసులో సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయ‌గా.. 2022 మే 20న ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని సీతాపూర్ జైలు నుండి ఆజం ఖాన్ విడుదలయ్యారు.

Updated On 17 April 2023 1:37 AM GMT
Yagnik

Yagnik

Next Story