అయోధ్యలో(Ayodhya) భక్తుల రద్దీ కొనసాగుతోంది. బాలరాముడి(Ram Lalla) దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. తొలిరోజు 5 లక్షల మంది రాముడి దర్శనం చేసుకోగా, రెండోరోజు బుధవారం 3 లక్షల మంది దర్శించుకున్నారు. మూడోరోజు గురువారం ఉదయం నుంచే రాముడి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. భక్తుల రద్దీ కారణంగా పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేశారు.

అయోధ్యలో(Ayodhya) భక్తుల రద్దీ కొనసాగుతోంది. బాలరాముడి(Ram Lalla) దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. తొలిరోజు 5 లక్షల మంది రాముడి దర్శనం చేసుకోగా, రెండోరోజు బుధవారం 3 లక్షల మంది దర్శించుకున్నారు. మూడోరోజు గురువారం ఉదయం నుంచే రాముడి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. భక్తుల రద్దీ కారణంగా పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీని(Piligrims) దృష్టిలో పెట్టుకొని క్యూలైన్లు(Que line) పెంచామని, పరిస్థితి కంట్రోల్​లో ఉందని లా అండ్ ఆర్డర్ డీజీ ప్రశాంత్ కుమార్(Prashanth Kumar) వెల్లడించారు. "మొదటి రోజుతో పోలిస్తే భక్తుల రద్దీ తగ్గింది. దర్శనం ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు చేశాం. మరో ఎగ్జిట్ రూట్, పబ్లిక్ ఫెసిలిటేషన్ సెంటర్ కూడా ఏర్పాటు చేశాం" అని హోంశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ సంజయ్ ప్రసాద్(Sanjay Prasad) తెలిపారు. ‘‘అయోధ్యకు వెళ్లే రోడ్లు మొత్తం వెహికల్స్ తో రద్దీగా మారాయి. భక్తుల రద్దీ నియంత్రణ కోసం సుల్తాన్ పూర్ నుంచి అయోధ్యకు బస్సులు నిలిపివేశాం” అని యూపీఎస్​ఆర్టీసీ(UPSRTC) ఆర్​ఎం నాగేంద్ర ప్రసాద్ పాండే(RM Nagendra Prasad Pandey) పేర్కొన్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయంలో ఏర్పాట్లపై అధికారులతో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ సమావేశం నిర్వహించారు. "రాముడి దర్శనం ప్రశాంతంగా జరిగేలా భక్తులకు ఏర్పాట్లు చేయండి. పిల్లలు, వృద్ధులు, మహిళల విషయంలో ప్రత్యేక చర్యలు చేపట్టండి" ఆలయ అధికారులకు సూచించారు. అయోధ్యకు వచ్చే వీఐపీలు ఒక వారం ముందుగానే ప్రభుత్వానికి లేదా ట్రస్టుకు సమాచారం ఇవ్వాలని సీఎం యోగి ఆదిత్యనాధ్ కోరారు.

Updated On 25 Jan 2024 6:06 AM GMT
Ehatv

Ehatv

Next Story