అయోధ్యలో ఎల్లుండి రామమందిర ప్రారంభోత్సవం జరుగనుంది. అలాగే బాలరాముని ప్రాణప్రతిష్ట కూడా చేస్తారు. ప్రతి భక్తుడు తమ జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా తప్పక దర్శించుకోవాల్సిన పుణ్యక్షేత్రం అయోధ్య రామమందిరం. ఈ నెల 23 తర్వాత అయోధ్యకు వెళ్లేందుకు చాలా మంది భక్తులు సిద్ధమవుతున్నారు. కానీ.. అయోధ్యలో జరుగుతున్న పూజా కార్యక్రమాలతోపాటు దర్శనానికి ఎలాంటి విధివిధానాలు ఉన్నాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

అయోధ్యలో ఎల్లుండి రామమందిర ప్రారంభోత్సవం జరుగనుంది. అలాగే బాలరాముని ప్రాణప్రతిష్ట కూడా చేస్తారు. ప్రతి భక్తుడు తమ జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా తప్పక దర్శించుకోవాల్సిన పుణ్యక్షేత్రం అయోధ్య రామమందిరం. ఈ నెల 23 తర్వాత అయోధ్యకు వెళ్లేందుకు చాలా మంది భక్తులు సిద్ధమవుతున్నారు. కానీ.. అయోధ్యలో జరుగుతున్న పూజా కార్యక్రమాలతోపాటు దర్శనానికి ఎలాంటి విధివిధానాలు ఉన్నాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

హిందువుల చిరకాల స్వప్నం రామమందిర నిర్మాణం. ఆ కల నెరవేరింది. ఈ నెల 22న బాలరాముని ప్రాణప్రతిష్ట తర్వాత అయోధ్యను దర్శించుకోవాలని భక్తులు సిద్ధమవుతున్నారు. అయోధ్యలో బాలరాముని దర్శించుకోవాలంటే ముందుగానే రిజిస్టేషన్‌ చేసుకోవాలనే నిబంధన ఉంది. దీని కోసం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం ఏర్పాటు చేసిన అధికారిక వెబ్‌సైట్‌ (https://online.srjbtkshetra.org)లో మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి లాగిన్ కావాలి. ఆ తర్వాత ఓటీపీ నమోదు చేస్తేనే పూర్తి పేజీ ఓపెన్ అవుతుంది. దానిలో ‘దర్శన్’ ఎంపికపై క్లిక్ చేసి వివరాలు పూర్తి చేయాలి. అందులో దర్శనం తేదీ, సమయం, భక్తుల సంఖ్య, రాష్ట్రం, దేశం, మొబైల్ నంబర్‌తోపాటు మీ ఫోటోను కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక దర్శనానికి 24 గంటల ముందు సంబంధిత భక్తునికి మెసేజ్‌ లేదా మెయిల్ వస్తుంది. దర్శనానికి టికెట్‎తోపాటు ఐడీ ప్రూఫ్ కూడా వెంట తీసుకువెళ్లాలి. 10 ఏళ్ల కంటే చిన్న వయసు పిల్లలకు దర్శనం టికెట్లు అవసరం లేదు. భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులలో మాత్రమే దర్శనానికి రావాలి. పురుషులు ధోతీ-కుర్తా లేదా కుర్తా, పైజామా.. మహిళలు చీర, దుపట్టాతో కూడిన పంజాబీ దుస్తులు లేదా దుపట్టాతో చుడీదార్ సూట్ ధరించి దర్శనం చేసుకోవచ్చు.

అయోధ్యకు దారెది?

రైలు మార్గం..
రైలు మార్గం ద్వారా అయోధ్యకు దేశంలో ఎక్కడ నుంచైనా వెళ్లేందుకు అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్యకు వెళ్లాలనుకునేవారు మాత్రం సికింద్రాబాద్ నుంచి రైలులో గోరఖ్‎పూర్ చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడి నుంచి అక్కడి నుంచి రైలు లేదా బస్సు ద్వారా అయోధ్యకు చేరుకోవచ్చు. అలాగే ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల 50 నిమిషాలకు సికింద్రాబాద్ నుంచి గోరఖ్‎పూర్‌కు వెళ్లే రైలు అందుబాటులో ఉంది. గోరఖ్‎పూర్‌ చేరుకోవడానికి 30 గంటల సమయం పడుతుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బీదర్ అయోధ్య వీక్లీ ఎక్స్ ప్రెస్ కూడా ఉంది. ఇది ప్రతి సోమ, ఆదివారాలలో అందుబాటులో ఉంటుంది. అంటే..అయోధ్యకు ప్రతి శుక్ర, ఆది, సోమ వారాల్లో భక్తులు రైలు ప్రయాణం సాగించాల్సి ఉంటుంది. అయోధ్యకు వెళ్లే భక్తుల కోసం సికింద్రా బాద్ నుంచి ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది.

రోడ్డు మార్గం..
హైదరాబాద్ నుంచి అయోధ్యకు రోడ్డు మార్గంలో చేరుకోవాలంటే మొత్తం 1305 కిలో మీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అయోధ్య వెళ్లేందుకు ప్రయివేట్ ట్రావెల్ బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఏసీ బస్సుల్లో ఒకరికి టికెట్ ధర 6 వేల రూపాయలు ఉంది. ఢిల్లీ చేరుకోవడానికి 40 గంటల సమయం పడుతుంది. హైదరాబాద్ నుంచి ప్రైవేటు వాహనాల్లో వెళ్లాలనుకునే వారు నాగపూర్, జబల్ పూర్, ప్రయాగ్‌రాజ్ మీదుగా అయోధ్యకు చేరుకోవాల్సి ఉంటుంది.

విమానయానం..
హైదరాబాద్‌ శంషాబాద్ విమానాశ్రయం నుంచి అయోధ్యకు నేరుగా వెళ్లేందుకు విమానాలు అందుబాటులో ఉన్నాయి. కానీ..అవి పరిమిత సంఖ్యలో మాత్రమే ఉన్నాయి. లేదంటే.. ఢిల్లీ, లేదా గోరఖ్ పూర్, లక్నో విమానాశ్రయాలకు చేరుకుని, అక్కడి నుంచి బస్సు లేదా రైలు మార్గం ద్వారా 140 కిలోమీటర్లు ప్రయాణం చేసి అయోధ్యకు చేరుకోవచ్చు. అయితే..విమానయాన సంస్థలు కూడా అయోధ్యకు స్పెషల్ ఫ్లైట్స్ నడిపే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Updated On 20 Jan 2024 12:23 AM GMT
Ehatv

Ehatv

Next Story