తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK stalin) కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్(Udayanidhi stalin) సనాతన ధర్మం(Sanathana Dharmam) గురించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగ్యూలతో పోల్చడంతో ఆయన పలు విమర్శలు ఎదుర్కొంటున్నారు.

ఇదిలా ఉంటే, అయోధ్యకు(Ayodhya) చెందిన పరమహంస ఆచార్య(Priest Paramahamsa) అనే సాధువు ఒక చేతిలో ఉదయనిధి పోస్టర్, మరో చేతిలో కత్తి పట్టుకుని ఉన్న వీడియోను విడుదల చేశారు. వీడియోలో.. ఆయన పోస్టర్‌లో కత్తితో ఉదయనిధి తలను నరికి, ఆపై నిప్పు పెట్టడం చూడవచ్చు.
సంత్ పరమహంస్ ఆచార్య తన వీడియోలో ఉదయనిధి స్టాలిన్ తల నరికిన వారికి 10 కోట్ల రూపాయల బహుమతిని కూడా ప్రకటించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పుడు ఈ వీడియోపై ఉదయనిధి స్వయంగా స్పందించారు.
'నా తల నరికిన వారికి రూ.10 కోట్లు ప్రకటించిన ప్రభువు ఉన్నాడు. ఆయన నిజంగా సాధువు లేదా నకిలీవా? ఆయనకు నా తల ఎందుకు అంత ఇష్టం?.. ఇంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తున్నారని ప్రశ్నించారు. నా జుట్టు దువ్వుకోవడానికి రూ.10 కోట్లు ప్రకటిస్తున్నారా? రూ.10 విలువైన దువ్వెన ఇస్తే నేనే ఈ పని చేస్తానని చెప్పాడు.
అయోధ్యలోని తపస్వి చవానీ ఆలయ ప్రధాన అర్చకుడు జగద్గురు పరమహంస ఆచార్య సోమవారం విడుదల చేసిన వీడియోలో.. స్టాలిన్ తల నరికి నా వద్దకు తీసుకొచ్చిన వారికి రూ.10 కోట్ల రివార్డు ఇస్తానని చెప్పాడు. స్టాలిన్‌ను చంపే ధైర్యం ఎవరికీ లేకపోతే నేనే చంపేస్తానని అన్నారు.
సనాతన ధర్మానికి సంబంధించి ఉదయనిధి తన ప్రకటనకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని ప్రకటించారు. తాను హిందూ సమాజాన్ని టార్గెట్ చేయలేదని అంటున్నారు. సనాతన ధర్మం శాశ్వతమని, దానిని మార్చలేమని పేర్కొన్నారు.