ఉత్తరప్రదేశ్‌లోని(Uttarpradesh) అయోధ్యలో(Ayodhya) నూతనంగా నిర్మితమైన రామమందిరానికి(ram mandir) భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. బాలరాముడి(RAm lalla) దర్శనం కోసం విదేశాల నుంచి భక్తులు(Pilgrim) వస్తుండటం విశేసం. కేవలం 11 రోజుల్లోనే పాతిక లక్షలమందికి పైగా భక్తులు అయోధ్య మందిరానికి వచ్చారు. ఈ క్రమంలో 11 కోట్ల రూపాయల మేర హుండీ ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు చెబుతున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని(Uttarpradesh) అయోధ్యలో(Ayodhya) నూతనంగా నిర్మితమైన రామమందిరానికి(ram mandir) భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. బాలరాముడి(Ram lalla) దర్శనం కోసం విదేశాల నుంచి భక్తులు(Pilgrim) వస్తుండటం విశేసం. కేవలం 11 రోజుల్లోనే పాతిక లక్షలమందికి పైగా భక్తులు అయోధ్య మందిరానికి వచ్చారు. ఈ క్రమంలో 11 కోట్ల రూపాయల మేర హుండీ ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు చెబుతున్నారు. బాలక్ రామ్ దర్శన మార్గంలో నాలుగు హుండీలను ఏర్పాటు చేశారు. గత 11 రోజుల్లో పాతిక లక్షల మంది భక్తులు బాలరాముడిని దర్శించుకున్నారు. ఎనిమిది కోట్ల రూపాయల హుండీ ఆదాయంలో వచ్చింది. అలాగే చెక్కుల రూపంలో 3.5 కోట్ల రూపాయలు వచ్చాయి. ఇందులో ఆన్‌లైన్ విరాళాలు కూడా ఉండటం గమనార్హం. మొత్తం 14 మంది హుండీ సొమ్మును లెక్కించారు. ఇదంతా సీసీ టీవీ కెమెరాల నిఘా పర్యవేక్షణలోనే జరిగింది. భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో సందర్శన సమయాన్ని కూడా పెంచారు. ప్రతి రోజులు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు భక్తులు ఆలయాన్ని సందర్శించుకోవచ్చని అధికారులు తెలిపారు. ఇంతకు ముందు ఆలయ దర్శన వేళలు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే ఉండింది.