అయోధ్యలోని(Ayodhya) రామాలయం సనాతన విలువలకు ప్రతిబింబంగా నిలుస్తున్నది. నాగర్ శైలిలో నిర్మిస్తున్న ఈ ఆలయ ప్రాంగణంలో దక్షిణ ద్రావిడ(South Dravida) నిర్మాణ శైలి ప్రభావం కూడా కనిపిస్తున్నది. పంచాయతన సంప్రదాయమూ గోచరిస్తున్నది. రామాలయంలోకి తూర్ప ద్వారం నుంచి ప్రవేశించాలి. 33 మెట్లు ఎక్కిన తర్వాత ఆలయంలోకి ప్రవేశిస్తాము. ఆలయ ప్రదక్షిణ, దర్శనం తర్వాత దక్షిణ దిశ నుంచి బయటకు రావాల్సి ఉంటుంది.

Ram Mandir East Gate
అయోధ్యలోని(Ayodhya) రామాలయం సనాతన విలువలకు ప్రతిబింబంగా నిలుస్తున్నది. నాగర్ శైలిలో నిర్మిస్తున్న ఈ ఆలయ ప్రాంగణంలో దక్షిణ ద్రావిడ(South Dravida) నిర్మాణ శైలి ప్రభావం కూడా కనిపిస్తున్నది. పంచాయతన సంప్రదాయమూ గోచరిస్తున్నది. రామాలయంలోకి తూర్ప ద్వారం నుంచి ప్రవేశించాలి. 33 మెట్లు ఎక్కిన తర్వాత ఆలయంలోకి ప్రవేశిస్తాము. ఆలయ ప్రదక్షిణ, దర్శనం తర్వాత దక్షిణ దిశ నుంచి బయటకు రావాల్సి ఉంటుంది. మొత్తం 70 ఎకరాలలో ఆలయ సముదాయం ఉంది. ఇందులో పాతిక నుంచి 30 శాతం స్థలంలో మాత్రమే ప్రధాన ఆలయం ఉంటుంది. మిగిలిన ప్రాంతం అంతా పచ్చదనంలో నిండి ఉంటుంది. 2024, జనవరి 22వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ(Narendra modi) ఆలయంలోని బాలరాముడి విగ్రహానికి ప్రతిష్టాపన చేస్తారు. ఆ సమయానికి గ్రౌండ్ ఫ్లోర్, తూర్పు(East) ప్రధాన ద్వారాలు సిద్ధం అవుతాయి. మొదటి అంతస్తులో శ్రీరామ దర్బార్ ఉంటుంది. పూజలు, ప్రార్థనలు, భజనల కోసం ఐదు మండపాలు నిర్మిస్తున్నారు. ఆలయ సముదాయంలో మొత్తం 44 ద్వారాలు ఉంటాయి. ఆలయ ప్రాంగణంలో నీటి శుద్ధి కేంద్రం, అగ్నిమాపక కేంద్రం కూడా ఉన్నాయి. భక్తుల కోసం సుమారు 25 వేల లాకర్లు ఏర్పాటు చేశారు. భక్తులు తమ లగేజ్‌ను, సామానును ఇక్కడ ఫ్రీగా పెట్టుకోవచ్చు. అలయం చుట్టూ దీర్ఘచతురస్రాకార ప్రహారిని నిర్మించారు. ఆలయ నలు మూలలలో సూర్యభగవానుడు, గణపతి, శివుడు, భగవతి ఆలయాలు ఉన్నాయి.
