అయోధ్యలోని(Ayodhya) రామమందిరంలో(Ram Mandhir) శ్రీరామచంద్రుడు కొలువుదీరడానికి ముహూర్తం దగ్గరపడింది. మరో 40 రోజుల్లో శ్రీరాముడికి ప్రధాని నరేంద్రమోదీ(PM Narendra Modi) ప్రాణప్రతిష్ట చేయనున్నారు.

అయోధ్యలోని(Ayodhya) రామమందిరంలో(Ram Mandhir) శ్రీరామచంద్రుడు కొలువుదీరడానికి ముహూర్తం దగ్గరపడింది. మరో 40 రోజుల్లో శ్రీరాముడికి ప్రధాని నరేంద్రమోదీ(PM Narendra Modi) ప్రాణప్రతిష్ట చేయనున్నారు. వచ్చే ఏడాది జనవరి 22న జరిగే ఈ సుముహూర్తం కోసం దేశ ప్రజలు వేయికన్నులతో వేచి చూస్తున్నారు. కాశీకి చెందిన పండితులు లక్ష్మీకాంత దీక్షిత్‌(Lakshmi Kanta Dixit) నేతృత్వంలో 121 మందికి పైగా వేదపండితుల బృందం జనవరి 16 నుంచి 22 వరకు రామాలయంలో పూజలు(Prayers) నిర్వహించనుంది. శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టకు(consecration) ముందు యాగంతో పాటు చతుర్వేదాల పఠనం కూడా ఉంటుంది. మొత్తం 60 గంటల పాటు రకరకాల పూజాది కార్యక్రమాలు జరుగుతాయి. శ్రీరాముడికి 56 రకాల ప్రసాదాలు సమర్పించిన తర్వాత ప్రధాని మోదీ శ్రీరాముడికి ఘనమైన హారతి ఇవ్వనున్నారు. జనవరి 17న ఉదయం ఎనిమిది గంటలకు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం మొదలవుతుంది. ఇది మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగుతుంది. తర్వాత మధ్యాహ్నం మూడు గంటలకు వివిధ పూజలు మొదలవుతాయి. రాత్రి 9.30 గంటల వరకు ఈ పూజలు కొనసాగుతాయి. జనవరి 16 నుంచి 22 వరకు ప్రతి రోజూ పది నుంచి పన్నెండు గంటల పాటు రామాలయంలో పూజలు జరుగుతాయి. జనవరి 22న బాలరాముడు గర్బగుడిలో కొలువుదీరనున్నాడు. ఈ పూజాదికాల కోసం ఆలయ ప్రాంగణంలో పలు మండపాలు, హోమగుండాలను ఏర్పాటు చేస్తున్నారు.

Updated On 12 Dec 2023 12:27 AM GMT
Ehatv

Ehatv

Next Story