అయోధ్యలో(Ayodhya) అపూర్వఘట్టం ఆవిష్కృతం అయింది. కోట్లాది భారతీయుల కల సాకారమైంది. శ్రీరాముడి జన్మస్థలం అయోధ్యలో రామమందిరం(Ram mandir) ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది.
అయోధ్యలో(Ayodhya) అపూర్వఘట్టం ఆవిష్కృతం అయింది. కోట్లాది భారతీయుల కల సాకారమైంది. శ్రీరాముడి జన్మస్థలం అయోధ్యలో రామమందిరం(Ram mandir) ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. రామజన్మభూమిలో నూతనంగా నిర్మించిన మందిరంలో బాలరాముడు కొలువుదీరాడు. ప్రధాని మోదీ చేతుల మీదుగ సోమవారం మేషలగ్నం అభిజిత్ ముహూర్తంలో ప్రాణ ప్రతిష్ట క్రతువు జరిగింది. విగ్రహ ప్రతిష్టకు కర్తగా వ్యవహరించారు ప్రధాని మోదీ. ప్రాణ ప్రతిష్ట సమయంలో ఆలయం మీద నుంచి హెలికాప్టర్లతో పూల వర్షం కురిపించారు.
అయితే రామమందిర ప్రారంభానికి హాజరైన 7 వేలకుపైగా అతిథులకు ప్రత్యేక ప్రసాదం బాక్స్‌ను(Prasadam Box) రామమందిర తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ అందించింది. ఒక్కో బాక్స్‌లో ఏడు రకాల పదార్థాలను(7 items) ఉంచింది. ఆలూ చిప్స్(Aloo chips), లడ్డూ(Laddu), నువ్వు చిక్కీలు(Nuvvula chikki), బాదాం(Almond), జీడిపప్పు(Cashwenuts), ఎండుద్రాక్ష(Kismis), మఖానాను ముఖ్య అతిథులకు అందించారు. 'ది కుక్'(The cook) అనే సంస్థ వీటిని తయారు చేసినట్లు ట్రస్ట్ అధికారులు తెలిపారు.