ప్రధాని నరేంద్రమోదీ(Narendra modi), హోంమంత్రి అమిత్‌ షా(Amit shah) మనసులో ఉన్నది బీజేపీ(BJP) ఎంపీ లల్లూసింగ్‌(MP Lallusingh) బయటపెట్టారు. ఎన్‌డీయే కూటమి(NDA alliance) మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని(Constitution) మార్చేస్తామని ఆయన నొక్కి వక్కాణించారు. రాజ్యాంగ మార్పుపై ప్రతిపక్షాలలో ఉన్న అనుమానాలు దీంతో పటాపంచలు అయ్యాయి.

ప్రధాని నరేంద్రమోదీ(Narendra modi), హోంమంత్రి అమిత్‌ షా(Amit shah) మనసులో ఉన్నది బీజేపీ(BJP) ఎంపీ లల్లూసింగ్‌(MP Lallusingh) బయటపెట్టారు. ఎన్‌డీయే కూటమి(NDA alliance) మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని(Constitution) మార్చేస్తామని ఆయన నొక్కి వక్కాణించారు. రాజ్యాంగ మార్పుపై ప్రతిపక్షాలలో ఉన్న అనుమానాలు దీంతో పటాపంచలు అయ్యాయి. తాము రాజ్యాంగాన్ని మార్చబోమని ప్రధాని చెబుతున్నప్పటికీ విపక్షాలకు ఆయనపై విశ్వాసం లేదు. రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ కూడా దాన్ని మార్చలేరని మోదీ అంటున్నప్పటికీ బీజేపీ నేతలు పదే పదే రాజ్యాంగ మార్పుపై మాట్లాడుతున్నారు. నిప్పు లేనిదే పొగ రాదుగా! ఎన్డీయే కూటమికి మూడింట రెండొంతుల మెజారిటీని కట్టబెడితే తప్పకుండా రాజ్యాంగాన్ని తిరగరాస్తామంటూ అయోధ్య సిట్టింగ్‌ ఎంపీ, బీజేపీ నేత లల్లూసింగ్‌ చెప్పడం సర్వత్రా ఆందోళన కలిగిస్తున్నది.

చిత్రమేమిటంటే అంబేద్కర్‌ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలోనే లల్లూసింగ్‌ ఈ మాట అనడం. ‘272 లోక్‌సభ సభ్యుల మద్దతుతో ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేయవచ్చు. అయితే, ఈ మెజారిటీతో రాజ్యాంగ సవరణలు కష్టం. రాజ్యాంగాన్ని మార్చాలన్నా లేకపోతే కొత్త రాజ్యాంగాన్ని తీసుకురావాలన్నా మాకు మూడింట రెండు వంతుల మోజారిటీ అవసరం' అని లల్లూసింగ్‌ చెప్పుకొచ్చారు. ఆయన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తడంతో దిద్దుబాటు చర్యలకు దిగారు. తప్పుడు ఉద్దేశంతో తాను ఆ వ్యాఖ్యలు చేయలేదన్నారు. మరోవైపు రాజ్యాంగంలో మార్పులు జరుగొచ్చంటూ బీజేపీ నేత, సినీ నటుడు అరుణ్‌ గోవిల్‌ లేటెస్ట్‌గా ఇలాంటి మాటలే మాట్లాడారు. ‘కాలానుగుణంగా రాజ్యాంగంలో మార్పులు జరిగాయి.

మార్పు అనేది అభివృద్ధికి సంకేతం. ఇది ప్రతికూలాంశం కాదు. నాటికీ, నేటికీ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. రాజ్యాంగంలో మార్పులు జరగాలంటే ఒక వ్యక్తి అభిప్రాయంతో సాధ్యం కాదు. అందరి సమ్మతితో దాన్ని మార్చుకోవచ్చు’ అని అరుణ్‌ గోవిల్‌ చెప్పారు. ఈయన కామెంట్స్‌పై కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ ఇద్దరే కాదు, బీజేపీలో చాలా మంది రాజ్యాంగంపై ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు.

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయేకి 400కు పైగా లోక్‌సభ స్థానాలు వస్తే , హిందువులకు అనుకూలంగా రాజ్యాంగాన్ని మార్చేస్తామని ఎంపీ అనంత్‌కుమార్‌ హెగ్డే కిందట నెలలో చెప్పుకొచ్చారు. రాజ్యాంగ పీఠికలో లౌకికవాదం అనే పదాన్ని కూడా తొలగిస్తామన్నారు. హిందువులకు అనుకూలమైన రాజ్యాంగం రావాలంటే నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీకి లోక్‌సభలో అధిక సీట్లు ఇవ్వాలని అనంత్‌కుమార్‌ హెగ్డే అన్నారు. బీజేపీకి లోక్‌సభ, రాజ్యసభలతో పాటు రాష్ట్రాల ప్రభుత్వాల్లో 2/3 వంతుల మెజారిటీ ఉండాలని తెలిపారు. నాగ్‌పూర్‌ నుంచి పోటీచేస్తున్న బీజేపీ అభ్యర్థి జ్యోతి మిర్దా కూడా ఇలాంటి పలుకులే పలికారు. దేశ ప్రయోజనాల కోసం కొన్ని కఠినమైన నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుందని, దీనికోసం రాజ్యాంగంలో సవరణలు, దాన్ని మార్చడం అవసరమని చెప్పారు. ఇది జరుగాలంటే ఉభయ సభల్లో బీజేపీకి 2/3 వంతుల మెజార్టీ కావాలని ఆమె పేర్కొన్నారు. ఎన్నికలు ముంచుకొస్తున్న సమయాన బీజేపీ నేతల నుంచి ఇలాంటి మాటలు వస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది.

Updated On 16 April 2024 12:17 AM GMT
Ehatv

Ehatv

Next Story