అయోధ్యలోని రామమందిరం నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే సగం పనులు పూర్తయ్యాయి. ఈ ఏడాది చివరి నాటికి మందిరం సిద్ధమవుతుందని ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ తెలిపారు..

అయోధ్యలోని(Ayodhya) రామమందిరం నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే సగం పనులు పూర్తయ్యాయి. ఈ ఏడాది చివరి నాటికి మందిరం సిద్ధమవుతుందని ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌(Champat Rai) తెలిపారు.. ట్విట్టర్‌లో ఆలయానికి సంబంధించిన ఫోటోలను కూడా షేర్‌ చేశారు. మందిర నిర్మాణం పూర్తి అయిన తర్వాత గర్భగుడిలో దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్టిస్తామన్నారు. వచ్చే ఏడాది మకర సంక్రాంతి నుంచి భక్తులు అయోధ్య రాముడిని దర్శించుకోవచ్చని చంపత్‌ రాయ్‌ చెప్పారు.

గర్భగుడిలో రామ్‌లల్లా విగ్రహం 51 అంగుళాలు ఉంటుంది. మందిరం, పరిసరాల విస్తీర్ణాన్ని 110 ఎకరాలకు పెంచినట్టు ఆలయ ట్రస్ట్ వర్గాలు చెబుతున్నాయి. ఇంతకు ముందు పరిసరాల విస్తీర్ణం 67 ఎకరాలు మాత్రమే! మొత్తం వెయ్యి కోట్ల రూపాయలతో ఆలయాన్ని నిర్మిస్తున్నారు. మందిరం గోడలలో భారతీయ సంస్కృతిని తెలియచేసే చిత్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం ఢిల్లీలోని ఇందిరాగాంధీ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ది ఆర్ట్స్‌తో పాటు మత పెద్దలు, కళా నిపుణుల బృందం పూర్తి స్థాయిలో అధ్యయనం చేశాయన్నారు చంపత్ రాయ్‌. ఆలయంతో పాటు మ్యూజియం, డిజిటల్‌ ఆర్కైవ్స్‌ పరిశోధనా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు.

Updated On 7 April 2023 4:58 AM
Ehatv

Ehatv

Next Story