ఓటు వేయడం మన బాధ్యత! మన హక్కు! దాన్ని వినియోగించుకోవడం నేరమే! ఇది అందరికీ తెలిసిన విషయమే. అయినా ఓటేయడానికి పెద్దగా ఆసక్తి కనబర్చరు. ఈ జబ్బు చదువుకున్నవారిలోనే ఎక్కువగా ఉంటుంది. ఇది నిజం! పొద్దున లేస్తే వాట్సప్‌లలో నీతివచనాలు చెప్పే ప్రబుద్ధులంతా పోలింగ్‌ బూత్‌కు రావడానికి బద్ధకిస్తారు.

ఓటు వేయడం మన బాధ్యత! మన హక్కు! దాన్ని వినియోగించుకోవడం నేరమే! ఇది అందరికీ తెలిసిన విషయమే. అయినా ఓటేయడానికి పెద్దగా ఆసక్తి కనబర్చరు. ఈ జబ్బు చదువుకున్నవారిలోనే ఎక్కువగా ఉంటుంది. ఇది నిజం! పొద్దున లేస్తే వాట్సప్‌లలో నీతివచనాలు చెప్పే ప్రబుద్ధులంతా పోలింగ్‌ బూత్‌కు రావడానికి బద్ధకిస్తారు. ఎన్నికల సంఘం ఓటు హక్కుపై ఎంతగా ప్రచారం చేసినా చైతన్యం అనేది వస్తేగా! ఓటు వేయని వారికి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమాలన్నింటినీ ఆపేయాలి. అప్పుడు కానీ బుద్ధిరాదు. కొన్ని దేశాలలో అయితే ఓటు(Vote) వేయని వారికి ఇంతకంటే పెద్ద శిక్షలే విధిస్తారు.

బెల్జియంలో వరుసగా నాలుగుసార్లు ఓటు వేయలేదనుకోండి. పదేళ్ల వరకు ఓటు హక్కు ఉండదు. పైగా మొదటిసారి ఓటు వేయకపోతే(First Vote) నాలుగు వేల రూపాయలు జరిమానాగా విధిస్తారు. రెండోసారి పది వేల రూపాయలు జరిమానా వేస్తారు. వారికి ప్రభుత్వ ఉద్యోగావకాశాలు ఉండవు. అందుకే అక్కడ ఎన్నికలు జరిగిన ప్రతీసారి 96 శాతానికి పైగా పోలింగ్‌ నమోదవుతుంటుంది. ఆస్ట్రేలియాలో(Australia) కూడా జరిమానా(Fine) విధిస్తారు. ఓటు వేయకపోతే వారం రోజుల్లో జరిమానా చెల్లించాలనే నిబంధన ఉంది. ఇక్కడ కూడా 98 శాతం పోలింగ్‌ జరుగుతుంటుంది. సింగపూర్‌లో అయితే ఓటు వేయకపోతే ఓటరు జాబితా నుంచి పేరు తీసేస్తారు. ఓటు వేయకపోవడానికి కారణాలు చెబుతూ ఆధారాలు సమర్పించుకోవాలి. అందుకే పెద్దల సంతకం ఉండాలి. అప్పుడు కానీ ఓటు హక్కు తిరిగి పొందే అవకాశం ఉండదు. ఇక్కడ ప్రతీసారి 92 శాతం పోలింగ్‌ నమోదవుతుంటుంది. గ్రీస్‌లో అయితే ఓటు వేయనివారికి డ్రైవింగ్‌ లైసెన్స్‌ను రద్దు చేస్తారు. పాస్‌పోర్ట్‌ ఇవ్వరు. బలమైన కారణాలను చూపితే తప్ప వాటిని పునరుద్ధరించరు. ఇతర ప్రభుత్వ సౌకర్యాలపైనా కూడా ఆంక్షలు విధిస్తారు. ఇక్కడ ఎన్నికలు జరిగిన ప్రతీసారి 94 శాతం పోలింగ్‌ నమోదవుతుంటుంది.

Updated On 13 May 2024 12:05 AM GMT
Ehatv

Ehatv

Next Story