అహ్మదాబాద్‌లో(Ahmedabad) జ‌రిగిన ఫైన‌ల్‌లో భారత్‌పై(Team India) ఆరు వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించిన తర్వాత ఆస్ట్రేలియా(Australia) ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్(Mitchell Marsh) ప్రతిష్టాత్మక ప్రపంచ కప్ ట్రోఫీని(World Cup Trophy) అగౌరవపరిచినట్లు ఆరోపణలు వచ్చాయి. సోషల్ మీడియాలో(Social media) కనిపించిన ఒక చిత్రంలో మిచెల్ మార్ష్ ట్రోఫీపై కాళ్లు పెట్టి కూర్చుని బీరు తాగుతూ కనిపించాడు.

అహ్మదాబాద్‌లో(Ahmedabad) జ‌రిగిన ఫైన‌ల్‌లో భారత్‌పై(Team India) ఆరు వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించిన తర్వాత ఆస్ట్రేలియా(Australia) ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్(Mitchell Marsh) ప్రతిష్టాత్మక ప్రపంచ కప్ ట్రోఫీని(World Cup Trophy) అగౌరవపరిచినట్లు ఆరోపణలు వచ్చాయి. సోషల్ మీడియాలో(Social media) కనిపించిన ఒక చిత్రంలో మిచెల్ మార్ష్ ట్రోఫీపై కాళ్లు పెట్టి కూర్చుని బీరు తాగుతూ కనిపించాడు. క్రికెట్ అభిమానులు దానిని తీవ్రంగా విమర్శిస్తున్నారు. 2015లో ఆస్ట్రేలియా ప్రపంచ ఛాంపియన్ జట్టులో కూడా భాగమైన మార్ష్.. ఆదివారం 15 పరుగులు మాత్ర‌మే చేసి జస్ప్రీత్ బుమ్రా బంతికి కేఎల్ రాహుల్‌కు చేతికి చిక్కాడు.

అయితే ఆస్ట్రేలియా విజయం తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో మార్ష్ ట్రోఫీపై కాళ్లు పెట్టి బీరు(Beer) తాగుతూ కూర్చున్నట్లు కనిపించాడు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు మార్ష్ ప్రవర్తన తప్పు అని.. ట్రోఫీ పట్ల కొంత గౌరవం ఉండాలని అంటున్నారు. మ‌రికొంత‌మంది టోఫ్రీని ట‌చ్ చేయ‌డానికి మీరు అర్హులు కాదంటూ మండిప‌డుతున్నారు. క్రికెట్ గాడ్‌ను చూసి నేర్చుకోండి అంటూ స‌చిన్ ఫోటోను షేర్ చేస్తూ మార్ష్‌పై మండిప‌డుతున్నారు నెటిజ‌న్లు.

Updated On 20 Nov 2023 4:28 AM GMT
Ehatv

Ehatv

Next Story