అయోధ్యలో(Ayodhya) రామాలయ నిర్మాణం దాదాపు పూర్తయ్యింది. మందిరంలో(Mandhir) శ్రీరాముడి విగ్రహ(Ram Idol) ప్రతిష్టాపనకు ముహూర్తం ఖరారయ్యింది. జనవరి 22న మధ్యాహ్నం మృగశిర(Mrigashira) నక్షత్రంలో అభిజిత్ ముహూర్తంలో 12.20 గంటలకు విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది. రామ్‌లల్లాకు రాముడి మూర్తిని చేరుస్తారు. ప్రధాని మోదీ(Narendra Modi) విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేయనున్నారు.
అయోధ్యలో(Ayodhya) రామాలయ నిర్మాణం దాదాపు పూర్తయ్యింది. మందిరంలో(Mandhir) శ్రీరాముడి విగ్రహ(Ram Idol) ప్రతిష్టాపనకు ముహూర్తం ఖరారయ్యింది. జనవరి 22న మధ్యాహ్నం మృగశిర(Mrigashira) నక్షత్రంలో అభిజిత్ ముహూర్తంలో 12.20 గంటలకు విగ్రహ ప్రతిష్టాపన(Idol Installation) జరగనుంది. రామ్‌లల్లాకు రాముడి మూర్తిని చేరుస్తారు. ప్రధాని మోదీ(Narendra Modi) విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేయనున్నారు. ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ స్థాయి ప్రచారం కల్పించడానికి సంఘ్ పరివార్ ప్రణాళికను సిద్ధం చేసుకుంది. వేడుకల ప్రచారాన్ని నాలుగు దశలుగా విభజించి ముందుకు తీసుకెళ్లాలని సాకేత్ నిలయంలో జరిగిన భేటిలో నిర్ణయించింది సంఘ్ పరివార్. ఇందులో మొదటి దశ కార్యక్రమం నిన్నటి నుంచి ప్రారంభమయ్యింది. డిసెంబర్ 20 వరకు ఇది కొనసాగుతుంది. ఇందుకోసం స్టీరింగ్ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. జిల్లా, బ్లాక్ స్థాయిలో పది మందితో కూడిన బృందాలను ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. జనవరి 1వ తేదీ నుంచి రెండో దశ ప్రచారం మొదలవుతుంది. ఇందులో ఇంటింటికి వెళ్లి పది కోట్ల కుటుంబాలకు అక్షతలు, రామ్‌లల్లా చిత్రపటం, కరపత్రం అందచేస్తారు.
ప్రతిష్ఠాపన రోజున ప్రతి ఒక్కరు దీపోత్సవం జరుపుకోవాలని విజ్ఞప్తి చేసింది. జనవరి 22న మూడో దశలో దేశవ్యాప్తంగా వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు. నాలుగో దశలో దేశవ్యాప్తంగా ఉన్న భక్తులకు రామ్‌లల్లా దర్శనం కల్పించే ఆలోచనలో ఉన్నారు.