తమిళనాడులోని(Tamilnadu) కళ్లకురిచ్చి(Kallakurichi) జిల్లా కరుమాపురం గ్రామంలో కల్తీ సారా కల్లోలం రేపుతోంది. ఇప్పటికే కల్తీ సారా తాగి 35 మంది చనిపోయారు.
తమిళనాడులోని(Tamilnadu) కళ్లకురిచ్చి(Kallakurichi) జిల్లా కరుమాపురం గ్రామంలో కల్తీ సారా కల్లోలం రేపుతోంది. ఇప్పటికే కల్తీ సారా తాగి 35 మంది చనిపోయారు. మరో 40 మంది హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.
ఈ కల్తీ సారాను గోవిందరాజు అనే వ్యక్తి తయారు చేసినట్టు అధికారులు గుర్తించారు. ఈ దారుణ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ సీరియస్‌గా రియాక్టయ్యారు. కళ్లకురిచిలో కల్తీ మద్యం సేవించి మృతి చెందారనే వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యానని, ఈ ఘటనలో నేరానికి పాల్పడిన వారిని అరెస్టు చేశామని, ఈ క్రమంలో నిరక్ష్యంగా ఉన్న అధికారులపై కూడా చర్యలు తీసుకున్నామని, సమాజాన్ని నాశనం చేసే ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై తక్షణమే చర్యలు తీసుకుంటామని ఎక్స్ వేదికగా చెప్పారు. మరోవైపు ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. జిల్లా ఎస్పీ సమయసింగ్ మీనాపై సస్పెన్షన్ వేటు వేసింది. అలాగే కలెక్టర్ శ్రావణ్‌కుమార్‌ను బదిలీ చేసింది. వీరి స్థానంలో కలెక్టర్‌గా ప్రశాంత్, ఎస్పీగా చతుర్వేదిని నియమించారు. ఇంకో వైపు చెన్నై నుంచి 18 ప్రత్యేక వైద్య బృందాలు కళ్లకురిచ్చి చేరుకున్నాయి. ఆ జిల్లాలోని ఎక్సైజ్ విభాగం ఉన్నతాధికారులందరిపై వేటు వేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది.