పదేళ్ల వయసున్నప్పుడు ఓ వ్యక్తికి అనుకోకుండా తలలోకి బుల్లెట్(Bullet) దిగింది. అప్పట్నుంచి ఆ పిల్లోడి పరిస్థితి దయనీయంగా మారింది. తలలో(Head) బులెట్ పెట్టుకునే 18 ఏళ్ల పాటు క్షణమొక యుగంగా గడిపాడు. నరకాన్ని అనుభవించాడు. ప్రతి ఆసుపత్రికి వెళ్లాడు. కనబడిన వైద్యుడిని దీనంగా అభ్యర్థించాడు. భయంకరమైన తలనొప్పితో(Headache), చెవి ఇన్‌ఫెక్షన్‌లతో(Ear Infection) దుర్భర జీవితాన్ని గడుపుతున్నాను, దయ చూపండి అవి వేడుకున్నాడు. ఎవరూ కనికరించలేదు. బుల్లెట్ తీయడం కష్టమన్నారు. తీస్తే చచ్చిపోతావని బెదిరించారు.
పదేళ్ల వయసున్నప్పుడు ఓ వ్యక్తికి అనుకోకుండా తలలోకి బుల్లెట్(Bullet) దిగింది. అప్పట్నుంచి ఆ పిల్లోడి పరిస్థితి దయనీయంగా మారింది. తలలో(Head) బులెట్ పెట్టుకునే 18 ఏళ్ల పాటు క్షణమొక యుగంగా గడిపాడు. నరకాన్ని అనుభవించాడు. ప్రతి ఆసుపత్రికి వెళ్లాడు. కనబడిన వైద్యుడిని దీనంగా అభ్యర్థించాడు. భయంకరమైన తలనొప్పితో(Headache), చెవి ఇన్‌ఫెక్షన్‌లతో(Ear Infection) దుర్భర జీవితాన్ని గడుపుతున్నాను, దయ చూపండి అవి వేడుకున్నాడు. ఎవరూ కనికరించలేదు. బుల్లెట్ తీయడం కష్టమన్నారు. తీస్తే చచ్చిపోతావని బెదిరించారు. చివరకు బెంగళూరు ఆసుపత్రి వైద్యులు అతడికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. బాధల నుంచి విముక్తి కల్పించారు.
యెమెన్‌కు చెందిన సలేహ్ అనే 29 ఏళ్ల వ్యక్తి గాధ ఇది! తలలో సుమారు మూడు సెంటీమీటర్ల బుల్లెట్ ఉంది. పదేళ్లున్నప్పుడు రెండు వర్గాల మధ్య జరిగిన పోరులో ఓ బుల్లెట్ అతడి చెవిలోంచి దూసుకెళ్లి తలలోని ఎడమవైపు ఎముకలోకి దిగిపోయింది. విపరీతమైన రక్తస్రావం(Bleeding) అయ్యింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ వైద్యులు ఆ బులెట్‌ను తీయలేకపోయారు. బుల్లెట్ చెవిలోపలికి వెళ్లడంతో దాన్ని తీయడం డాక్టర్లకు కష్టమయ్యంది. యాంటి బయాటిక్స్ ఇచ్చి పంపించారు. అప్పట్నుంచి 18 ఏళ్ల పాటు ఆ బుల్లెట్‌తోనే ఉన్నాడు. బుల్లెట్ కారణంగా వినికిడిశక్తి కోల్పోయాడు. పైగా తరచూ చెవికి ఇన్‌ఫెక్షన్ అయ్యేది. విపరీతమైన తలనొప్పి వచ్చేది. సలేహ్‌కు(Saleh) ఇద్దరు సోదరులు, చెల్లెళ్లు ఉన్నారు. ఇప్పుడు సలేహ్‌కు 29 ఏళ్లు.. పెళ్లయింది. ఇద్దరు పిల్లలు కూడా! అందరూ ఇతడి తల నుంచి బుల్లెట్ ఎప్పుడు పోతుందా అని ఆశగా ఎదురుచూసేవారు. ఈ సమయంలోనే సలేహ్ ఫ్రెండ్ ఒకరు బెంగళూరులోని ఆస్టర్ ఆసుపత్రి(Aster Hospital) గురించి చెప్పాడు. ఆలస్యం చేయకుండా ఆస్టర్ ఆసుపత్రికి వచ్చాడు. ఇక్కడి డాక్టర్లు కూడా సలేహ్‌కు పలు వైద్య పరీక్షలు చేశారు. బుల్లెట్‌ను తీయడం అసాధ్యమని చెప్పారు. రిస్క్ తీసుకోలేకపోయారు. అయితే బుల్లెట్ సరిగ్గా ఏ స్పాట్‌లో ఉందో తెలిస్తే దాన్ని తొలగించవచ్చని తెలుసుకున్నారు. ఇందుకోసం కాంట్రాస్ట్ సీటీ యాంజియోగ్రఫీని వైద్య బృందం ఎంచుకుంది. టూ డైమెన్షియల్ ఎక్స్‌రే సాయంతో బుల్లెట్ ఎక్కడ ఉందో తెలుసుకుంది. ఎక్కవ రక్తస్రావం అవ్వకుండా జాగ్రత్తగా బులెట్‌ను తొలగించింది. సర్జరీ చేస్తున్నంత సేపూ డాక్టర్లకు కూడా అనుమానంగానే ఉండింది. చివరకు బులెట్‌ను తొలగించారు. ఇప్పుడు సలేహ్‌కు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. హాయిగా యెమెన్‌కు తిరిగి వెళ్లారు.