సార్వత్రిక ఎన్నికల(Parliament ELections) తొలి దశ పోలింగ్ సాగుతోంది. దేశ వ్యాప్తంగా 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో ఉన్న మొత్తం 102 లోక్‌సభ స్థానాలకు పోలింగ్(Polling) జరుగుతోంది. మొత్తం 1,625 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇందులో 1,618 మందిని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ విశ్లేషించి వారి ఆస్తులపై ఓ నివేదిక విడుదల చేసింది.
సార్వత్రిక ఎన్నికల(Parliament ELections) తొలి దశ పోలింగ్ సాగుతోంది. దేశ వ్యాప్తంగా 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో ఉన్న మొత్తం 102 లోక్‌సభ స్థానాలకు పోలింగ్(Polling) జరుగుతోంది. మొత్తం 1,625 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇందులో 1,618 మందిని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ విశ్లేషించి వారి ఆస్తులపై ఓ నివేదిక విడుదల చేసింది. తొలి దశ ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థులలో పది మంది దగ్గర ఆస్తిపాస్తులేమీ(Assests) లేవట! సున్నా ఆస్తులట! అలాగే కోట్లకు పడగలెత్తినవారు 450 మంది ఉన్నారట! మధ్యప్రదేశ్‌లోని చింద్వారా నియోజకవర్గం నుంచి మరోసారి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి నకుల్ నాథ్ అత్యంత సంపన్న అభ్యర్థి. ఈయనగారి దగ్గర 716 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్(Kamalnath) కుమారుడే నకుల్‌నాథ్(Nakulnath). 2019 లోక్‌సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఏకైక సీటు ఇదే. కమల్‌నాథ్‌ను పార్టీలోకి లాగేసుకోవాలని ఆ మధ్యన బీజేపీ తెగ ప్రయత్నించింది. కమల్‌నాథ్ కూడా ఆవైపు మొగ్గు చూపారు. కొడుకు టికెట్ విషయంలో బీజేపీ(BJP) నుంచి భరోసా రాకపోవడంతో మనసు మార్చుకున్నారు. ఇక తమిళనాడులోని ఈరోడ్ నుంచి పోటీ చేస్తున్న అశోక్‌కుమార్‌కు(Ashok kumar) కూడా కోట్ల కొద్దీ ఆస్తులు ఉన్నాయి. అన్నాడీఏంకే(Anna DMK) నుంచి పోటీ చేస్తున్న ఈయన దగ్గర 662 కోట్ల రూపాయలు ఉన్నాయి. మూడో స్థానంలో బీజేపీకి చెందిన దేవనాథన్ యాదవ్ ఉన్నారు. తమిళనాడులోని శివగంగ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఈయనకు 304 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఇక్కడ్నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ కార్తీ చిదంబరం పోటీ చేస్తున్నారు. కార్తీ చిదంబరం దగ్గర 96 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. మొదటి దశ ఎన్నికల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల్లో ఆస్తిపాస్తులేమీ లేని వాళ్లు పది మంది ఉన్నారు. తమిళనాడులోని తూత్తుకుడి నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థి పోటీ చేస్తున్న పొన్‌రాజ్ కె దగ్గర 320 రూపాయల విలువైన ఆస్తులు మాత్రమే ఉన్నాయట! మహారాష్ట్రలోని రామ్‌టెక్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్న కార్తీక్ గెండ్లాజీ డోక్ దగ్గర 500 రూపాయల ఆస్తులున్నాయి. తమిళనాడులోని చెన్నై నార్త్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన సూర్యముత్తులు దగ్గర కూడా 500 రూఊపాయలే ఉన్నాయట!