లేడి సింగంగా పాపులరైన మహిళా పోలీస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ జున్ముణి రాభా(Junmoni Rabha) అస్సాంలో(assam) రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కొల్పోయిన సంగతి తెలిసిందే! నిజంగానే ఇది ప్రమాదమా? లేక హత్యా? అన్నది తేలాల్సి ఉంది. ఎందుకంటే ఆ ఘటనపై చాలా అనుమానాలున్నాయి.

లేడి సింగంగా పాపులరైన మహిళా పోలీస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ జున్ముణి రాభా(Junmoni Rabha) అస్సాంలో(assam) రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కొల్పోయిన సంగతి తెలిసిందే! నిజంగానే ఇది ప్రమాదమా? లేక హత్యా? అన్నది తేలాల్సి ఉంది. ఎందుకంటే ఆ ఘటనపై చాలా అనుమానాలున్నాయి. ఘటనకు సంబంధించి బోల్డన్నీ సందేహాలను వ్యక్తం చేస్తూ ఓ ఆడియో క్లిప్‌తో పాటు మరో వీడియో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. జున్ముణి రాభాను పోలీసు శాఖలోని కొందరు అధికారులు చిత్రహింసలు పెట్టి చంపారని ఓ కానిస్టేబుల్‌ చెప్పిన ఓ ఆడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. రాభా అనుమానాస్పద మరణంపై దర్యాప్తు చేస్తున్న సీఐడీ అధికారులు ఆ కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

ప్రమాద సమయంలో జున్ముణి రాభా కారు ట్రక్కును ఢీకొట్టలేదని, ఆ సమయంలో రాభా కారు నిలిపే ఉందని, ట్రక్కే వచ్చి కారును ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షిగా చెప్పుకొంటున్న ఓ వ్యక్తి అంటున్నాడు. దీనికి సంబంధించిన వివరాలతో ఓ వీడియో విడుదల చేశాడు. ట్రక్కు ఢీ కొట్టడానికి ముందు కారులోంచి ఇద్దరు వ్యక్తులు దిగిపోయారని వీడియోలో అతడు తెలిపారు. అసలు ప్రమాదం జరిగినట్టు వార్త వచ్చిన వెంటనే జున్ముణి రాభా తల్లి సుమిత్రా రాభా అనేక అనుమానాలను లేవనెత్తారు. సివిల్‌ దుస్తులలో ఒంటరిగా తన ప్రైవేటు కారులో వెళుతున్నప్పుడు ప్రమాదం జరిగింది. ఆమె ఎక్కడకు వెళుతున్నారనేది ఎవరికీ తెలియదు. పకడ్బందీ ప్రణాళికతోనే ఈ హత్య జరిగిందని సుమిత్ర అప్పుడే చెప్పారు.

Updated On 19 May 2023 12:13 AM GMT
Ehatv

Ehatv

Next Story