ఓ విద్యార్థి ఉత్తర కేరళలోని(North Kerala) కుట్టిపురం బస్టాండ్‌లో(Kuttiuram Bus stop) హృదయవిదారకర ఘటన చోటు చేసుకుంది. ఆకలిని తట్టుకోలేక ఓ విద్యార్థి చనిపోయిన పిల్లి పచ్చిమాసం(Cat Flesh) తింటుండాన్ని స్థానికులు గమనించారు.
ఓ విద్యార్థి ఉత్తర కేరళలోని(North Kerala) కుట్టిపురం బస్టాండ్‌లో(Kuttiuram Bus stop) హృదయవిదారకర ఘటన చోటు చేసుకుంది. ఆకలిని తట్టుకోలేక ఓ విద్యార్థి చనిపోయిన పిల్లి పచ్చిమాసం(Cat Flesh) తింటుండాన్ని స్థానికులు గమనించారు. ఈ ఘటనను చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అస్సాం చెందిన ఓ విద్యార్థికి రోజుల తరబడి తినడానికి ఆహారం దొరకడం లేదు. రద్దీగా ఉండే బస్టాండ్‌లో కూర్చొని పిల్లి మాంసాన్ని తినడం చూసి జనాలు ఆశ్చర్యపోయారు. విద్యార్థి అసోం రాష్ట్రానికి చెందినవాడిగా గుర్తించారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు విద్యార్థిని విచారించారు. దీంతో అసలు విషయాన్ని బయటపెట్టాడు.
అస్సాంలోని(Assam) ఓ కాలేజ్‌లో చదువుతున్న విద్యార్థి ఇంట్లో చెప్పకుండా రైలు ఎక్కి కేరళకు చెరుకున్నాడని తేలింది. గత ఐదురోజులుగా ఆహారం లేక అలమటించినట్లు తెలిపాడు. ఇదే విషయాన్ని చెన్నైలో ఉంటున్న విద్యార్థి సోదరుడికి ఫోన్‌లో పోలీసులు తెలియజేశారు. ఆ తర్వాత వైద్య పరీక్షల(Medical test) కోసం యువకుడిని త్రిసూర్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. యువకుడికి శారీరక, మానసిక సమస్యలు లేవని వైద్యులు తెలిపారు. యువకుడి కుటుంబసభ్యులు వస్తే వారికి అతనిని అప్పగిస్తామని పోలీసులు చెప్పారు.