ఆశకు హద్దుండాలి కదండి.. ఆల్‌రెడీ తను ఎమ్మెల్యే పదవిని చక్కగా అనుభవిస్తున్నాడు. అది చాలదన్నట్టు తన భార్యకు లోక్‌సభ టికెట్(Lok Sabha Ticket) కావాలన్నాడు. కుదరంది అధిష్టానం. అంతే మనసారుకు కోపం వచ్చేసింది. భార్య ముద్దుగా ఓ కోరిక కోరితే తీర్చలేని పదవి ఎందుకు అని అనుకునేసి రాజీనామా చేసి పడేశారు. రాజీనామా చేసింది పదవికి కాదండోయ్.. పార్టీకి! ఈ ఘటన అసోం(Assam)లో చోటు చేసుకుంది.
ఆశకు హద్దుండాలి కదండి.. ఆల్‌రెడీ తను ఎమ్మెల్యే పదవిని చక్కగా అనుభవిస్తున్నాడు. అది చాలదన్నట్టు తన భార్యకు లోక్‌సభ టికెట్(Lok Sabha Ticket) కావాలన్నాడు. కుదరంది అధిష్టానం. అంతే మనసారుకు కోపం వచ్చేసింది. భార్య ముద్దుగా ఓ కోరిక కోరితే తీర్చలేని పదవి ఎందుకు అని అనుకునేసి రాజీనామా చేసి పడేశారు. రాజీనామా చేసింది పదవికి కాదండోయ్.. పార్టీకి! ఈ ఘటన అసోం(Assam)లో చోటు చేసుకుంది. లఖింపూర్ జిల్లా(Lakhimpur District)లోని నౌబోయిచా నియోజకవర్గం ఎమ్మెల్యే భరత్‌చంద్ర నారా(Bharat Chandra Narah) తన భార్యకు లోక్‌సభ టికెట్ ఇవ్వలేదని చెప్పి కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. తన రాజీనామా పత్రాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు పంపించారు. భరత్ చంద్ర నారా పార్టీకి రాజీనామా చేసిన మాట నిజమేనని అసోం సీఎల్‌పీ నాయకుడు దేబబ్రత సైకియా తెలిపారు. అంతకు ముందు నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి హిమంత బిస్వాశర్మ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. వీరిలో ఒక ఎమ్మెల్యే షెర్మాన్ అలీ అహ్మద్ సస్పెండ్ అయ్యారు. మిగిలిన ఎమ్మెల్యేలు శశికాంత దాస్, సిద్ధిక్ అహ్మద్, కమలాఖ్య డే పుర్కాయస్థ, బసంత దాస్‌లు మాత్రం కాంగ్రెస్‌కు ఇంకా రాజీనామా చేయలేదు. అసోంలో 14 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటికి మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. 2014లో జరిగిన ఎన్నికల్లో 14 స్థానాలలో బీజేపీ ఏడు స్థానాలను గెల్చుకుంది. కాంగ్రెస్, ఆల్ ఇండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ చెరో మూడు స్థానాలను గెల్చుకున్నాయి. 2019లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి తొమ్మిది స్థానాలు లభించాయి. కాంగ్రెస్ తన మూడు స్థానాలను నిలబెట్టుకోగలిగింది. మరి ఈసారి ఏమవుతుందో చూడాలి!