అస్సాం(Assam) ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు(Government Employees) రెండు రోజులు ప్రత్యేక సెలవులు(Special Holidyas) ప్రకటించింది.
అస్సాం(Assam) ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు(Government Employees) రెండు రోజులు ప్రత్యేక సెలవులు(Special Holidyas) ప్రకటించింది. నవంబర్ 6,8వ తేదీలలో రెండు ప్రత్యేక క్యాజువల్ సెలవులు(Casual leaves) ఇస్తున్నట్టు ప్రకటించింది. ఆ రెండు రోజులు ప్రత్యేకత ఏమిటి అంటారా? ప్రత్యేకత ఏమీ లేదు కానీ ఆ సెలవులు కేవలం తల్లిదండ్రులు, అత్తమామలతో గడిపేందుకు మాత్రమే! లీవులిచ్చారు కదా అని వేరే రకంగ ఎంజాయ్ చేస్తే కుదరదని అసోం సర్కార్ స్ట్రిక్ట్‌గా చెప్పింది. వయో వృద్ధులైన తల్లిదండ్రులు, అత్తమామలను జాగ్రత్తగా చూసుకోవడానికి, వారికి గౌరవం, మర్యాద ఇవ్వడానికి ఈ సెలవులు ప్రత్యేక సందర్భమని తెలిపింది. నవంబర్ 7వ తేదీన ఛాత్ పూజ, నవంబర్ 9వ తేదీన రెండో శనివారం, నవంబర్ 10 తేదీన ఆదివారంతో పాటు ఈ రెండు రోజుల సెలవును ఉపయోగించుకోవచ్చని అసోం ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.