రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు భూపేన్ బోరా వచ్చే ఏడాది బీజేపీలో చేరతారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ప్రకటించారు. తాను ఒక్కసారి డయల్ చేస్తే చాలా మంది ప్రతిపక్ష నేతలు బీజేపీలో చేరతారని ఆయన అన్నారు.

రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు భూపేన్ బోరా వచ్చే ఏడాది బీజేపీలో చేరతారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ప్రకటించారు. తాను ఒక్కసారి డయల్ చేస్తే చాలా మంది ప్రతిపక్ష నేతలు బీజేపీలో చేరతారని ఆయన అన్నారు. “అసోంలో కాంగ్రెస్ పార్టీ నా సలహా తీసుకున్న తర్వాతే పనులు చేస్తుంది. నీలిరక్త కుటుంబాలకు చెందిన ఒకరిద్దరు నాయకులను మినహాయిస్తే.. మిగిలిన నాయకులు అభివృద్ధి రాజకీయాలతో తాము కలుస్తారు ”అని ముఖ్యమంత్రి శర్మ‌ అన్నారు.

"భూపేన్ బోరా 2025 జనవరి లేదా ఫిబ్రవరిలో చేరతారు. అసెంబ్లీ ఎన్నికలలో పోరాడటానికి నేను అతని కోసం రెండు స్థానాలను కూడా ఎంపిక చేసాను," అని సీఎం అన్నారు. భార్య రాణీ నారాకు టికెట్ నిరాకరించడంతో సోమవారం కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన సీనియ‌ర్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి భరత్ చంద్ర నారా బీజేపీతో టచ్‌లో లేరని ముఖ్యమంత్రి చెప్పారు. “భరత్ నారా రాజీనామా చేయడం ఇప్పటికీ కాంగ్రెస్ అంతర్గత విషయం. ఎందుకంటే ఆయ‌న‌ పార్టీని వీడే ముందు బీజేపీని సంప్రదించలేదు. అతను నాతో లేదా నా ఇతర పార్టీ నేత‌ల‌తో టచ్‌లో లేడు”అన్నారాయన.

Updated On 25 March 2024 9:38 PM GMT
Yagnik

Yagnik

Next Story