కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మణిపూర్ పర్యటనను బీజేపీ టార్గెట్ చేసింది. రాహుల్ గాంధీ మణిపూర్ పర్యటన రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు పరిష్కారం చూపదని, కేవలం ఒకరోజు మీడియా ప్రచారం కోసమేనని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ అన్నారు.

Assam CM slams Rahul Gandhi’s Manipur visit, calls it ‘media hype’
కాంగ్రెస్ నేత(Congress Leader) రాహుల్ గాంధీ(Rahul Gandhi) మణిపూర్(Manipur) పర్యటనను బీజేపీ(BJP) టార్గెట్ చేసింది. రాహుల్ గాంధీ మణిపూర్ పర్యటన రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు పరిష్కారం చూపదని, కేవలం ఒకరోజు మీడియా ప్రచారం కోసమేనని అస్సాం ముఖ్యమంత్రి(Assam CM) హిమంత బిస్వా శర్మ(Himanta Biswa Sarma) అన్నారు.
మణిపూర్‌లో పరిస్థితిని అదుపులోకి తెచ్చే బాధ్యత కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వానిదేనని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ విలేకరులతో అన్నారు. అందుకే ఏ రాజకీయ నాయకుడూ వెళ్లాల్సిన అవసరం లేదు. రాహుల్ పర్యటన వల్ల ఎలాంటి పరిష్కారం రాదని శర్మ అన్నారు. ఆయన పర్యటన వల్ల ఏదైనా సానుకూల ఫలితం వచ్చిందా అనేది వేరే విషయం. అయితే ఆయన పర్యటన కేవలం మీడియా వ్యవహారం మాత్రమే అవుతుంది. దీని వల్ల మున్ముందు గానీ, తర్వాత గానీ ఎలాంటి ఫలితం ఉండదని వ్యాఖ్యానించారు.
ఇదిలావుంటే.. మణిపూర్‌లో రాహుల్ గాంధీ కాన్వాయ్(Rahul Convoy)ను పోలీసులు అడ్డుకున్నారు. ఇంఫాల్(Imphal) చేరుకున్న తరువాత రాహుల్ సహాయక శిబిరాలను సందర్శించడానికి చురచంద్‌పూర్ వైపు బయలుదేరారు. హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయని భావించిన పోలీసులు రాహుల్ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. మణిపూర్‌లో జరిగిన ఘటనను బీజేపీ 'డర్టీ పొలిటికల్ గేమ్'(Dirty Political Game)గా కాంగ్రెస్ అభివర్ణించింది.
