అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ(Himavanth Biswa sharma) మరోసారి నోరు జారారు. తరచూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేసే హిమంత ఈసారి ముస్లిం(Muslims) వ్యాపారులపై కామెంట్ చేశారు. వారి వల్లనే కూరగాయల(Vegetables) ధరలు చుక్కలంటుతున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి.
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ(Himanta Biswa Sharma) మరోసారి నోరు జారారు. తరచూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేసే హిమంత ఈసారి ముస్లిం(Muslims) వ్యాపారులపై కామెంట్ చేశారు. వారి వల్లనే కూరగాయల(Vegetables) ధరలు చుక్కలంటుతున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. అస్సామీయులు ఎప్పుడు వ్యాపారం చేసినా కూరగాయల ధరలు ఇంతలా పెరగలేదని, ముస్లిం వ్యాపారులే ధరలను పెంచుకుంటూ పోతున్నారని సీఎం చెప్పారు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ' మీరే చెప్పండి .. కూరగాయల ధరలను పెంచింది ఎవరు? మియాలు కాదా' అని అన్నారు. మియాలు అంటే అసోంలో ఉంటూ బెంగాలీ మాట్లాడే స్థానిక ముస్లింలు..
మియాలు బయట నుంచి వచ్చారని, వారు అస్సామీ సంస్కృతిని, భాషను కించపరుస్తూ జాత్యహంకారంతో వ్యవహరిస్తూ ఉంటారని హిమంత కామెంట్ చేశారు. అసోం సీఎం చేసిన ఈ వ్యాఖలపై మజ్లిస్ పార్టీ అధినే అసదుద్దీన్ ఒవైసీ రియాక్టయ్యారు. 'అసోంలో ఒక విచిత్రమైన గుంపు తయ్యారయ్యింది. వారింట్లో గేదె పాలు ఇవ్వకపోయినా , కోడి గుడ్డు పెట్టకపోయినా దానికి మియాలే కారణమంటారు. బహుశా వారి వ్యక్తిగత వైఫల్యాలకు కూడా మియా భాయ్ మీద నిందలు వేస్తారేమో' అని ఒవైసీ అన్నారు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ ముస్లింలతో చాలా చనువుగా ఉంటారు కదా మరి అక్కడికి వెళ్ళినప్పుడు టమాటాలు, పాలకూరను, బంగాళాదుంపలను ఎగుమతి చేయమని ఆయా దేశాలను కోరితే బాగుంటుందని ఓవైసీ ఎద్దేవా చేశారు.