ఢిల్లీ కూడా తగలబడుతుంది జాగ్రత్త!
బెంగాల్(Bengal) తగలబడితే, ఆ తర్వాత అస్సాం(Assam), బీహార్(Bihar), జార్ఖండ్(Jarkhand), ఒడిశా(Odisha), ఢిల్లీ(Delhi) కూడా తగలబడతాయనే విషయం గుర్తుంచుకోండి అంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamatha Benarjee) హెచ్చరికతో కూడిన వ్యాఖ్య చేశారు. బుధవారం కోల్‌కతాలో తృణమూల్ విద్యార్థి విభాగం నిర్వహించిన కార్యక్రమంలో మమతా ఈ మాట అన్నారు. మమత వ్యాఖ్యలకు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ(Biswa sarma) రియాక్టయ్యారు.అస్సాంను బెదరించడానికి ఎంత ధైర్యం అంటూ ప్రశ్నించారు. ' మాపై కళ్లు ఎర్రవి చేసి చూడకండి. మీ విఫల రాజకీయాలతో దేశాన్ని తగలబెట్టేందుకు ప్రయత్నించకండి’ అని ఎక్స్‌లో రాసుకొచ్చారు. రాజ్యాంగ పదవిలో ఉంటూ ఆమె దేశ వ్యతిరేక వాఖ్యలు చేశారన్నారు. ఆమెప చర్యలు తీసుకోవాలని బెంగాల్ బీజేపీ అధ్యుడు సుకాంత మజందార్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఓ లేఖ రాశారు.
ఇదిలా ఉంటే అత్యాచార ఘటనలను తమ ప్రభుత్వం ఏమాత్రం ఉపేక్షించబోదని, రేపిస్టులకు ఉరిశిక్ష పడేలా ప్రస్తుతం ఉన్న చట్టాలను సవరిస్తామని మమతా బెనర్జీ అన్నారు.వచ్చే వారమే అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడతామని, దీనిని గవర్నర్ ఆమోదించకపోతే రాజ్‌భవన్ ముందు తానే ధర్నాకు దిగుతానన్నారు. ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లు తిరిగి విధుల్లో చేరాలని ఆమె కోరారు. హత్యాచార ఘటనలో సీబీఐ విచారణ చేపట్టి 16 రోజులు గడుస్తున్నప్పటికీ న్యాయం ఎక్కడ జరిగిందని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు.