ధరల పెరుగుదలపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ చేసిన వివాదాస్పద ప్రకటన శుక్రవారం రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించింది. అస్సాంలో కూరగాయల ధరలు పెరగడానికి ముస్లిం సమాజమే కారణమని ముఖ్యమంత్రి ఆరోపించారు.

Assam chief minister Himanta Biswa Sarma said Miya Muslims are responsible for vegetable price rise in Guwahat
ధరల పెరుగుదల(Price Hike)పై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ(Assam CM Himanta Biswa Sarma) చేసిన వివాదాస్పద ప్రకటన శుక్రవారం రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించింది. అస్సాం(Assam)లో కూరగాయల ధరలు(Vegetable Prices) పెరగడానికి ముస్లిం సమాజమే కారణమని ముఖ్యమంత్రి ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల్లో కూరగాయల ధరలు తక్కువగా ఉన్నా.. నగరాలకు చేరేసరికి ధరలు పెరుగుతాయన్నారు. విక్రేతలందరూ రేట్లు పెంచుతున్నారని, వారిలో ఎక్కువ మంది మియాన్ (ముస్లిం)(Miya Muslims) వారేనని సీఎం శర్మ పేర్కొన్నారు.
అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ చేసిన వ్యాఖ్యలను సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్( SP President Akhilesh Yadav) ఖండించారు. కూరగాయల ధరల పెరుగుదలకు.. ఒక నిర్దిష్ట సమాజాన్ని బాధ్యులను చేయడం బీజేపీ(BJP) ముఖ్యమంత్రి చాలా సంకుచిత ఆలోచనను ప్రదర్శించడం ఖండించదగినది అని ఆయన అన్నారు. తమ ప్రభుత్వ లోపాలకు బీజేపీ వాళ్లు ఇతరులను తప్పుబడుతున్నారని అన్నారు.
