చారిత్రక కట్టడం తాజ్‌మహల్(tajmahal)ను కూల్చేయాలట! అక్కడ దేవాలయాలు నిర్మించాలట. అంతేనా కుతుబ్‌మినార్( qutib minar)కూడా కూల్చేసి ఆ ప్రదేశంలో గుళ్లు గోపురాలు కట్టాలట! ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చేస్తారో ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు.. అస్సాంకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రూపజ్యోతి కుర్మీ (bjp mla Rupjyoti Kurmi) ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీకి ఓ విజ్ఞాపన చేశారు. జోర్హాట్ జిల్లా మరియాని నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రూపజ్యోతి కుర్మీ మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించిన తాజ్‌మహల్ అసలు ప్రేమకు చిహ్నమే కాదన్నారు.
చారిత్రక కట్టడం తాజ్‌మహల్(tajmahal)ను కూల్చేయాలట! అక్కడ దేవాలయాలు నిర్మించాలట. అంతేనా కుతుబ్‌మినార్( qutib minar)కూడా కూల్చేసి ఆ ప్రదేశంలో గుళ్లు గోపురాలు కట్టాలట! ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చేస్తారో ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు.. అస్సాంకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రూపజ్యోతి కుర్మీ (bjp mla Rupjyoti Kurmi) ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీకి ఓ విజ్ఞాపన చేశారు. జోర్హాట్ జిల్లా మరియాని నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రూపజ్యోతి కుర్మీ మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించిన తాజ్‌మహల్ అసలు ప్రేమకు చిహ్నమే కాదన్నారు. షాజహాన్ (Shah Jahan) తన నాలుగో భార్య ముంతాజ్ (mumtaz)జ్ఞాపకార్థం తాజ్‌మహల్‌ను నిర్మించాడు. ముంతాజ్ అంటే అంత ప్రేమ ఉన్నప్పుడు ఆమె చనిపోయిన తర్వాత మూడు పెళ్లిళ్లు ఎందుకు చేసుకున్నాడు అంటూ ప్రశ్నించారు. నాలుగో భార్య అయిన ముంతాజ్ మహల్(mumtaz mahal) అపారమైన ప్రేమ ఉన్న షాజహాన్ ఆమె గుర్తుగా తాజ్‌మహల్ కట్టాడే అనుకుందాం.. మరి మిగతా ముగ్గురు భార్యలకు ఏమైందని రూపజ్యోతి అడుగుతున్నారు. దీనిపై విచారణ జరిపించాలని మోదీకి విన్నవించుకున్నారు. 'హిందూ రాజులు ఇచ్చిన నిధులతో తాజ్‌మహల్‌ను కట్టారు.
మన డబ్బుతో కట్టిన కట్టడం అది. ఒక మొఘల్ పాలకుడు జహంగీర్ 20 సార్లు వివాహం చేసుకున్నాడు. ప్రేమకు చిహ్నంగా చెప్పుకునే తాజ్‌మహల్ నిర్మించిన మరో చక్రవర్తి షాజహాన్ ఏడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఇలాంటి పాఠాలా పిల్లలకు నేర్పించేది.. అందుకే NCERT మొఘలులపై పాఠ్యాంశాలను తొలగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం' అని రూపజ్యోతి కుర్మీ వ్యాఖ్యానించారు. మొఘల్ కట్టడాలైన తాజ్‌మహల్, కుతుబ్ మినార్‌లను కూల్చివేసి ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన ఆలయలను నిర్మించాలని మోదీని కోరినట్టు చెప్పారు. ఆలయాల నిర్మాణాలకు తన ఏడాది జీతాన్ని విరాళంగా ఇస్తానన్నారు. తాజ్‌మహల్‌ను ప్రపంచ అద్భుతాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఈ పాలరాతి నిర్మాణాన్ని ప్రేమకు చిహ్నంగా భావిస్తారు. ఇప్పటికీ దీనిని సందర్శించడానికి ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది పర్యాటకులు వస్తుంటారు. పాపం ఇవేమీ బీజేపీ ఎమ్మెల్యేకు తెలియదు కాబోలని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అదీ కాకుండా కుతుబ్‌మినార్‌ను మొఘలులు కట్టలేదని, 12వ శతాబ్దంలో కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించారన్న విషయం కూడా రూపజ్యోతి కుర్మీకి తెలియదని అంటున్నారు.