రెండు ఈశాన్య రాష్ట్రాల సరిహద్దుల విష‌య‌మై దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వివాదాన్ని పరిష్కరించేందుకు అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వాలు గురువారం అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై సంతకాలు చేశాయి. దేశ రాజధానిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందం జరిగింది. ఈ ఎంఓయూపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రేమ ఖండూ సంతకాలు చేశారు.

రెండు ఈశాన్య రాష్ట్రాల సరిహద్దుల విష‌య‌మై దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వివాదాన్ని పరిష్కరించేందుకు అస్సాం(Assam), అరుణాచల్ ప్రదేశ్(Arunachal Pradesh) ప్రభుత్వాలు గురువారం అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై సంతకాలు చేశాయి. దేశ రాజధానిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amith Shah) సమక్షంలో ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందం జరిగింది. ఈ ఎంఓయూపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ(Himanta Biswa Sarma), అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రేమ ఖండూ(Pema Khandu) సంతకాలు చేశారు. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ మధ్య 1972 నుంచి సరిహద్దు వివాదం(Border Issue) ఉందని హిమంత బిస్వా శర్మ చెప్పారు. ఈ రోజు చర్చల ద్వారా అన్ని వివాదాలను పరిష్కరించుకున్నాం. హోంమంత్రి మార్గదర్శకత్వంలో, ప్రధానమంత్రి ఆశీస్సులతో ఈ వివాదం పరిష్కరించబడింది. ఇది ఒక మైలురాయిగా నిలిచిపోతుంద‌ని అన్నారు.

అంతర్ రాష్ట్ర సరిహద్దు వివాద పరిష్కారానికి అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ మధ్య ఒప్పందం కుదరడం గొప్ప విజయమని హోంమంత్రి అమిత్ షా అన్నారు. శాంతియుత, ఘర్షణలు లేని ఈశాన్య రాష్ట్రాల కోసం కలిసి పనిచేశామని అన్నారు. ఇది ఒక‌ మైలురాయి అని అన్నారు. అరుణాచల్ ప్రదేశ్‌తో దశాబ్దాలుగా ఉన్న సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 12 ప్రాంతీయ కమిటీలు ఇచ్చిన సిఫార్సులను అస్సాం ప్రభుత్వ మంత్రివర్గం బుధవారం ఆమోదించింది. గ‌త‌ మార్చి 2022లో అస్సాం, మేఘాలయ(Meghalaya) ప్రభుత్వాలు కూడా 50 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకుని చారిత్రాత్మక ఒప్పందంపై సంతకం చేశాయి.

Updated On 20 April 2023 9:29 AM GMT
Yagnik

Yagnik

Next Story