ఉత్తరప్రదేశ్‌(Uttarpradesh) వారణాసిలోని(Varanasi) జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌లో(Gnanawapi Mosque) తెలుగు శాసనాలు ఉన్నాయా? అవునంటోంది భారత పురావస్తు శాఖ(Department of Archeology of India) నివేదిక. మసీదు కాంప్లెక్స్‌ స్థానంలో భారీ హిందూ దేవాలయ(Temples) నిర్మాణం ఉండేదని చెబుతోంది. ఈ విషయాలను హిందూ పక్షం న్యాయవాది విష్ణు శంకర్‌ జైన్‌(Vishnu shankar Jain) చెప్పారు. గ్రౌండ్‌ పెన్‌ట్రేటింగ్‌ రాడార్‌(GPR) సర్వేలో వెల్లడైన అంశాలు కూడా ఈ నివేదికలో పొందుపరిచారు.

ఉత్తరప్రదేశ్‌(Uttarpradesh) వారణాసిలోని(Varanasi) జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌లో(Gnanawapi Mosque) తెలుగు శాసనాలు ఉన్నాయా? అవునంటోంది భారత పురావస్తు శాఖ(Department of Archeology of India) నివేదిక. మసీదు కాంప్లెక్స్‌ స్థానంలో భారీ హిందూ దేవాలయ(Temples) నిర్మాణం ఉండేదని చెబుతోంది. ఈ విషయాలను హిందూ పక్షం న్యాయవాది విష్ణు శంకర్‌ జైన్‌(Vishnu shankar Jain) చెప్పారు. గ్రౌండ్‌ పెన్‌ట్రేటింగ్‌ రాడార్‌(GPR) సర్వేలో వెల్లడైన అంశాలు కూడా ఈ నివేదికలో పొందుపరిచారు. ప్రస్తుతం నిర్మాణం అంతకుముందున్న నిర్మాణంపైన కట్టిందేనని సర్వే నివేదిక చెబుతోంది. మసీదులో చేసిన మార్పులను సర్వే గుర్తించింది. ఆలయం నుంచి తీసుకున్న కొన్ని స్తంభాలను కొద్దిగా మార్చి కొత్త నిర్మాణంలో ఉపయోగించారని, స్తంభాలపై ఉన్న చెక్కడాలను తొలగించే ప్రయత్నం చేశారని ఏఎస్‌ఐ(ASI) నివేదిక పేర్కొన్నట్లు విష్ణుశంకర్‌ జైన్‌ తెలిపారు. దేవనాగరి, తెలుగు, కన్నడ, ఇతర లిపిలలో ఉన్న ప్రాచీన హిందూ దేవాలయానికి చెందిన మొత్తం 34 శాసనాలు ప్రస్తుత, పూర్వపు నిర్మాణాలపై ఉన్నాయంటూ విష్ణుశంకర్‌ జైన్‌ సంచలన విషయాన్ని తెలియచేశారు. ఇవి వాస్తవానికి పూర్వం ఉన్న హిందూ దేవాలయంలో ఉన్న శాసనాలని, ఇవి ప్రస్తుతం ఉన్న నిర్మాణంలోనూ మరమ్మత్తు సమయంలో వీటిని ఉపయోగించారని తెలిపారు. అంటే అక్కడ పూర్వం ఉన్న హిందూ ఆలయాన్ని ధ్వంసం చేసి, దానికి సంబంధించిన భాగాలను తిరిగి వాడినట్లుగా రుజువవుతోందని తెలిపారు. ఈ శాసనాల్లో జనార్థన, రుద్ర, ఉమేశ్వర వంటి దేవతల పేర్లు కూడా ఉన్నాయని భారత పురావస్తు శాఖ నివేదికలో ఉందంటున్నారు జైన్‌. జ్ఞానవాపి మసీదు పురాతన హిందూ ఆలయ నిర్మాణంపై నిర్మించారా? లేదా అన్న విషయం తేల్చేందుకు గత ఏడాది వారణాసి కోర్టు అక్కడ ఏఎస్‌ఐ సర్వే జరపాలని ఆదేశించిన విషయం తెలిసిందే.

Updated On 26 Jan 2024 3:16 AM GMT
Ehatv

Ehatv

Next Story