టీచర్‌-స్టూడెంట్‌ మధ్య బలమైన బాండింగ్‌ ఉంటుంది. తల్లిదండ్రుల తర్వాత పిల్లల బాగోగులను చూసుకునేది టీచరే! వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేది కూడా టీచరే! కొందరు టీచర్లు అయితే విద్యార్థులను సొంత బిడ్డల్లా చూసుకుంటారు. ఈ టీచర్‌ కూడా అలాంటిదే! తన క్లాస్‌ రూమ్‌లో స్టూడెంట్లు గొడవపడుతున్నారని ఆందోళన చెందుతూ వారి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళుతుంది. కంగారుపడుతూ వచ్చిన టీచర్‌కు పిల్లలు పెద్ద షాకే ఇచ్చారు.

టీచర్‌-స్టూడెంట్‌ మధ్య బలమైన బాండింగ్‌ ఉంటుంది. తల్లిదండ్రుల తర్వాత పిల్లల బాగోగులను చూసుకునేది టీచరే! వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేది కూడా టీచరే! కొందరు టీచర్లు అయితే విద్యార్థులను సొంత బిడ్డల్లా చూసుకుంటారు. ఈ టీచర్‌ కూడా అలాంటిదే! తన క్లాస్‌ రూమ్‌లో స్టూడెంట్లు గొడవపడుతున్నారని ఆందోళన చెందుతూ వారి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళుతుంది. కంగారుపడుతూ వచ్చిన టీచర్‌కు పిల్లలు పెద్ద షాకే ఇచ్చారు. స్టూడెంట్లు(students) చేసిన పనికి భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకుందా టీచర్‌(Teacher)! ఇంతకీ వారేం చేశారంటే... ఆమె తమ దగ్గరకు రాగానే గుంపుగా ఉన్న స్టూడెంట్లు కాస్తా వేరుపడతారు. అప్పుడే చీటర్‌ వెనుక నుంచి ఒకరు పేపర్‌ పార్టీ పాపర్‌ను పగలగొడుతుంది. ఒక్కసారిగా రంగురంగుల కాగితాలు గాలిలో ఎగురుతూ టీచర్‌పై పడుతాయి. ఆ చప్పుడుకు చెవులు మూసుకుంటుందా టీచర్‌. వెంటనే టీచర్‌ కోసం పుట్టినరోజు(Birthday) పాట పాడతారు పిల్లలు. టీచర్‌కు ఓ పూలబోకేను(Flower boquet) అందిస్తారు. ఆ రోజు టీచర్‌ బర్త్‌డే కావడంతో ఆమెను సర్‌ప్రైజ్‌(Surprise) చేయడానికి పిల్లలు అలా ప్లాన్‌ చేస్తారు. తన విద్యార్థులు చేసిన పనికి టీచర్‌ కన్నీళ్లు పెట్టుకుటుంది. ఆమెకు బర్త్‌డే విషెస్‌ చెబుతూ ఆత్మీయ ఆలింగనం చేసుకుంటారు పిల్లలు. ఈ హార్ట్‌ టచింగ్ వీడియోను Ashraf EI Zarka తన ట్విట్టర్‌ ఖాతా నుంచి షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది. నెటిజన్లు తాము విద్యార్థులుగా ఉన్నప్పటి జ్ఞాపకాలను నెమరేసుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.

Updated On 9 Nov 2023 4:43 AM GMT
Ehatv

Ehatv

Next Story